కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ.. ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేసిన నాయకుల్లో ఆ పార్టీ చీఫ్ డీకే శివ కుమార్ అత్యంత ఆస్తి ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఆయన తనకు రూ.1414 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అందులో తన ఆస్తి వివరాలు కూడా వెల్లడించారు. ఆ అఫిడవిట్ ప్రకారం.. 2018తో పోలిస్తే ఆయన సంపద 68 శాతం పెరిగింది. తనకు, తన కుటుంబ సభ్యులకు మొత్తం రూ.1414 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. తనకు రూ.225 కోట్ల రుణం కూడా ఉందని కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకుల్లో డీకే శివ కుమార్ కు ఉన్నంత ఆస్తి ఎవరికీ లేదు.
కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ.. పార్టీకి రాజీనామా చేసిన అరవింద్ చౌహాన్.. ఎందుకంటే ?
2013 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన డీకే శివ కుమార్ సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తుల విలువ రూ. 251 కోట్లు కాగా, 2018 అఫిడవిట్‌లో తన బంధువుల ఆస్తులు కలిపి రూ. 840 కోట్లుగా పేర్కొన్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు 12 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తన సోదరుడు డీకే సురేష్ కలిపి జాయింట్ అకౌంట్ లు ఉన్నాయి.
మరో సారి ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల బరిలో బీజేపీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఎందుకంటే ?
ఒకే ఒక్క కారు.. 2 కిలోల బంగారం..
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ కు ఒకే ఒక్క కారు ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన వద్ద టయోటా కారు ఉందని, దాని ధర రూ.8,30,000 అని తెలిపారు. తన పేరుపై రూ.970 కోట్ల స్థిరాస్తులు ఉండగా.. తన భార్య ఉష పేరిట రూ.113.38 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన కుమారుడు ఆకాష్ పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.54.33 కోట్లు కాగా.. శివకుమార్ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.1,214.93 కోట్లు. శివకుమార్ తన వార్షిక ఆదాయం రూ. 14.24 కోట్లుగా, భార్య వార్షిక ఆదాయం రూ. 1.9 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద రెండు ఖరీదైన వాచ్ లు ఉన్నాయని, అలాగే 2 కిలోల బంగారం, 12 కేజీల వెండి ఉందని పేర్కొన్నారు. మొత్తంగా తనపై 19 కేసులు ఉన్నాయని అందులో అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇక మాఫియా ఎవరినీ భయపెట్టదు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఇదిలా ఉండగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న షాజియా తర్రానుమ్ తనకు రూ.1,629 కోట్ల ఆస్తి ఉందని తన నామినేషన్ పత్రాల్లో తెలిపారు. ఆయన తరువాత మరో బీజేపీ నాయకుడు ఎంటీబీ నాగరాజ్ తనకు రూ.1,607 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా ఎవరూ అడ్డుకోలేరు - యడియూరప్ప
కాగా.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి 198, కాంగ్రెస్ నుంచి 195, జేడీ(ఎస్) నుంచి 86, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 50, బీఎస్పీ నుంచి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే గుర్తింపు లేని పార్టీల నుంచి 134, స్వతంత్రుల నుంచి 161 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 20 చివరి రోజుగా ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.