కరోనా నుండి కోలుకొన్న యడియూరప్ప: ఆసుపత్రి నుండి కర్ణాటక సీఎం డిశ్చార్జ్

By narsimha lodeFirst Published Apr 22, 2021, 11:55 AM IST
Highlights

కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప  గురువారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రెండోసారి కరోనా సోకడంతో యడియూరప్ప ఈ నెల 16వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరాడు.

బెంగుళూరు: కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప  గురువారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రెండోసారి కరోనా సోకడంతో యడియూరప్ప ఈ నెల 16వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరాడు.కరోనా సోకడంతో  ఆయన వైద్యుల సలహా మేరకు ఈ నెల 16వ తేదీన ఆసుపత్రిలో చేరాడు.  ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్న తర్వాత  యడియూరప్ప కరోనా నుండి కోలుకొన్నారు.

దీంతో  ఆయన గురువారం నాడు  ఉదయం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రం నాడు  ఉదయం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.  చికిత్స తర్వాత తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని యడియూరప్ప తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా  ఆయన తెలిపారు.  రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

also read:కర్ణాటక సీఎం యడియూరప్పకు రెండోసారి కరోనా: ఆసుపత్రిలో చికిత్స

ఈ నెల 16వ తేదీన కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఆయనకు కరోనా సోకిన విషయం నిర్ధారణ అయింది.  మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదౌతున్నాయి.  దీంతో కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది. 

2020 ఆగష్టు మాసంలో యడియూరప్పకు కరోనా సోకింది. దీంతో  ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. ఈ ఏడాది మరోసారి ఆయన కరోనా బారినపడ్డారు.  దేశంలోని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్, తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు  కరోనా బారినపడ్డారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. 
 


 

click me!