గుడ్‌న్యూస్: వ్యాక్సిన్ తీసుకొన్న 10 వేలమందిలో నలుగురికే కోవిడ్

Published : Apr 22, 2021, 10:18 AM IST
గుడ్‌న్యూస్:  వ్యాక్సిన్ తీసుకొన్న 10 వేలమందిలో నలుగురికే కోవిడ్

సారాంశం

కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న ప్రతి 10 వేల మందిలో నలుగురు మాత్రమే కరోనా బారినపడినట్టుగా  ఐసీఎంఆర్ ప్రకటించింది.  

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న ప్రతి 10 వేల మందిలో నలుగురు మాత్రమే కరోనా బారినపడినట్టుగా  ఐసీఎంఆర్ ప్రకటించింది.దేశంలో ఉపయోగంలో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు రెండు డోసులు తీసుకొన్న వారిలో ఎందరికి కరోనా సోకిందనే విషయమై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. 

also read:కరోనా కొత్త మ్యుటేషన్లపై భేష్: కోవాగ్జిన్‌పై ఐసీఎంఆర్ స్టడీ

ఈ రెండు వ్యాక్సిన్లు  మంచి ప్రభావం చూపాయని ఐసీఎంఆర్ తెలిపింది.  ఇన్‌ఫెక్షన్లు  తగ్గడంతో పాటు  మరణాల రేటు బాగా తగ్గిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు.వ్యాక్సిన్ తీసుకొన్నవారిలో తిరిగి కరోనా బారినపడినవారిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎక్కువగా ఉన్నారని ఐసీఎంఆర్ తెలిపింది. 

దేశంలో ఈ ఏడాది మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.  ఈ మేరకు  వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలని ప్రధాని ఆయా పార్మా కంపెనీలను కోరారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడ కరోనా వ్యాక్సిన్ వేసుకొనేందుకు వీలుగా వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు బహిరంగ మార్కెట్లో కూడ వ్యాక్సిన్ ను విక్రయించుకొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?