పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసిన  కర్ణాటక సీఎం..   

By Rajesh KarampooriFirst Published May 28, 2023, 5:44 AM IST
Highlights

గత బిజెపి ప్రభుత్వ హయాంలో పనిచేసిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిలదీసి, నిష్పక్షపాతంగా పని చేయాలని కోరారు.

రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై నిషేధం విధించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కాషాయీకరణ, నైతిక పోలీసింగ్‌లు జరగకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

బెంగళూరులోని విధానసౌధలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. “కాషాయం చేయవద్దు, మోరల్ పోలీసింగ్ చేయవద్దని తాము సీనియర్ పోలీసు అధికారులందరికీ సూచించామని తెలిపారు. తప్పుడు వార్తలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

గత బిజెపి ప్రభుత్వ హయాంలో పనిచేసిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నిలదీసి, నిష్పక్షపాతంగా పని చేయాలని కోరారు. ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్ , శాంతిభద్రతలకు భరోసా ఇవ్వడమే ప్రాధాన్యత అని ఆయన అన్నారు. సామాజిక సామరస్యానికి భంగం కలిగించే లేదా కొన్ని వర్గాలను రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్ట్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసులకు సూచించారు.

పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, ఫిర్యాదు చేసేందుకు వచ్చే వ్యక్తుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని కోరామని, నేరాలు, రౌడీయిజం, క్లబ్బులు వంటి చట్టవ్యతిరేక చర్యలకు పోలీసు ఇన్‌స్పెక్టర్‌, డీసీపీలే కాకుండా డీసీపీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మతాల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని, అందరినీ సమానంగా చూడాలని, సమానంగా రక్షించాలని సూచించారు.

అంతకు ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారులను కాషాయీకరణ చేయనివ్వబోదని హెచ్చరించారు. యూనిఫాంలో కాషాయికరణ పెట్టుకోవద్దని పోలీసు శాఖకు వార్నింగ్ ఇచ్చా’ అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. 2021లో బీజేపీ హయాంలో పండగ జరుపుకుంటున్న సందర్భంగా మంగళూరు, విజయపుర, బాగల్‌కోట్‌లో కొందరు పోలీసులు కాషాయ వేషధారణలో ఉన్న నేపథ్యంలో డీసీఎం ఇలా అన్నారు. శాఖ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.

click me!