పార్లమెంట్ వీడియోకు షారుక్ ఖాన్ గాత్రం.. ఎమోషనలవుతున్న నెటిజన్లు ..

కొత్త పార్లమెంట్ భవనాన్ని నేడు ప్రారంభించనున్న సందర్భంగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు హౌస్‌కి సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ, న్యూ ఇండియా కొత్త పార్లమెంట్ హౌస్ గురించి వివరించాడు.


భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. అనేక హంగులు, ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దీన్ని ప్రారంభించనున్నారు. దానికి ముందు.. కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఓ క్లిప్‌ను విడుదల చేసి, ఈ వీడియోకు వాయిస్ ఓవర్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు అందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా తన గాత్రాన్ని అందించాడు. తన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. 

షారుఖ్ ఖాన్ తన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ఇలా వ్రాశారు. 'మన రాజ్యాంగాన్ని సమర్థించేవారికి, ఈ గొప్ప దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహించే, ప్రజల వైవిధ్యాన్ని రక్షించేవారికి ఎంత అద్భుతమైన కొత్త ఇల్లు. నవ భారతం కోసం.. నవ పార్లమెంట్ . నా పార్లమెంట్‌ హౌస్‌ నాకు గర్వకారణం. జై హింద్!!’’  అని పేర్కొన్నారు.

Latest Videos

షారుక్ ఖాన్ ఏం చెప్పారంటే..  

ఒకటిన్నర నిమిషాల నిడివి గల వీడియోలో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. 'భారతదేశ నూతన పార్లమెంట్ భవనం, మా ఆశల కొత్త ఇల్లు. 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా ఉండే మన రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికి ఇల్లు. ఈ కొత్త ఇల్లు దేశంలోని ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం,నగరానికి స్థానం ఉంది. ఈ భవనం చాలా పెద్దది. దేశంలోని ప్రతి కులం, ప్రతి జాతి, ప్రతి మతాన్ని ప్రేమించగలిగేలా ఈ ఇంటి బాహువులు చాలా విశాలంగా ఉండుగాక. దాని కళ్ళు దేశంలోని ప్రతి పౌరుడిని చూడగలిగేంత లోతుగా ఉండాలి. తనిఖీ చేయవచ్చు, వారి సమస్యలను గుర్తించండి. ఇక్కడ సత్యమేవ జయతే నినాదం కాదు, విశ్వాసం ఉండాలి. మన దేశ అధికార చిహ్నం (గుర్రం,సింహం,అశోక చక్ర స్తంభం) లోగో మాత్రమే కాదు.. మన దేశ చరిత్ర. అంటూ.. నూతన పార్లమెంట్ గురించి వివరించారు. 

What a magnificent new home for the people who uphold our Constitution, represent every citizen of this great Nation and protect the diversity of her one People ji.
A new Parliament building for a New India but with the age old dream of Glory for India. Jai Hind!… pic.twitter.com/FjXFZwYk2T

— Shah Rukh Khan (@iamsrk)

కింగ్‌ఖాన్‌ పై ప్రశంసల వర్షం

కింగ్‌ఖాన్‌ చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా వ్రాశారు, "మా పార్లమెంట్, కింగ్ ఖాన్ అద్భుతమైన గాత్రం , స్వదేస్ సంగీతంతో కూడిన అద్భుతమైన వీడియోను చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు. ఇది కాకుండా చాలా మంది వినియోగదారులు ఈ పోస్ట్‌లో హృదయ ఎమోజీని కూడా పంచుకున్నారు.


కొత్త పార్లమెంట్ హౌస్ ప్రత్యేక ఫీచర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు జరిగే మెగా ఈవెంట్‌లో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. రూ.971 కోట్లతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది లోక్ సభ, 300 మంది రాజ్యసభ సభ్యులకు స్థలం ఉంటుంది. లోక్‌సభ ఉమ్మడి సమావేశానికి రూపకల్పన చేయబడుతోంది . 1,272 మంది సభ్యులకు ఆతిథ్యం ఇవ్వగలదు.
 

click me!