తప్పులన్నీ మీవే... ఇంతగా దిగజారాలా : సిద్ధరామయ్యపై బసవరాజ్ బొమ్మై తీవ్ర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 1, 2022, 4:06 PM IST
Highlights

ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలంటూ కర్ణాటక ప్రతిపక్షనేత , కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. అసలు ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు బ్యాన్ చేయాలని ఆయన ప్రశ్నించారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బొమ్మై తప్పుబట్టారు. పీఎఫ్ఐను ఎందుకు నిషేధించారని అడిగే నైతిక హక్కు కూడా కాంగ్రెస్‌కు లేదని ఆయన అన్నారు. పీఎఫ్‌ఐపై గతంలో నమోదైన కేసులను కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసిందని సీఎం చురకలంటించారు. ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించాలని అంటున్నారని బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు బ్యాన్ చేయాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భారతదేశానికి ఆర్ఎస్ఎస్‌ ఎంతో చేసిందని.. పేదలు, అణగారిన వర్గాలను ఆదుకునేందుకు ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసిందని బసవరాజ్ బొమ్మై గుర్తుచేశారు. ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్‌ కృషి చేస్తోందని... ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని సిద్ధరామయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బొమ్మై. 

కాగా... కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా "పీఎఫ్ఐ, దాని అసోసియేట్‌లు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లను తక్షణమే చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది" అని ప్రకటించింది. పీఎఫ్ఐతో పాటు రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF)తో సహా దాని సంబంధ సంస్థ‌ల‌పై కూడా నిషేధం విధించబడింది. క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (NCHRO), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ ల‌ను చ‌ట్ట‌విరుద్ధ‌మైన సంఘాల జాబితాలోకి వెళ్లాయి.

ALso REad:PFI: పీఎఫ్ఐపై నిషేధం నేప‌థ్యంలో ఢిల్లీలో పోలీసులు హై అల‌ర్ట్

దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు, ప్రజా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉన్న పీఎఫ్ఐ-దాని సహచరులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొంది. ఆయా సంస్థ‌లు దేశంలో తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్న విష‌యాల‌ను ప్ర‌స్తావించింది. “చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (1) ద్వారా అందించబడిన అధికారాల అమలులో (37 ఆఫ్ 1967), కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF)తో సహా దాని సహచరులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లను నిషేధ సంస్థ‌లుగా ప్రకటించింది. క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఎఐఐసి), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌సిహెచ్‌ఆర్‌ఓ), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ లు చట్టవిరుద్ధమైన సంఘాలు' అని నోటిఫికేషన్ పేర్కొంది.

click me!