యడ్డీ సీఎంగా ఉంటారా.. ప్రతిపక్షనేతగా మారతారా: డిసెంబర్‌ 9పై అందరి దృష్టి

By Siva Kodati  |  First Published Dec 5, 2019, 8:47 PM IST

కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 60 శాతం పోలింగ్ నమోదైంది.


కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 60 శాతం పోలింగ్ నమోదైంది. ఆయ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలు ఓట్లు వేసేందుకు ఉదయం నుంచి భారీగా తరలివచ్చారు.

సాయంత్రం 5 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓట్లు వేసే అవకాశం కల్పిస్తున్నారు. బెంగళూరు నగరంలోని కేఆర్ పురం, యశ్వంత్ పూర్, మహాలక్ష్మీ లేఔట్, శివాజీ నగర్‌ నియోజకవర్గాల్లో పోలీసులు గట్టి భద్రను ఏర్పాటు చేశారు.

Latest Videos

undefined

Also Read:చిదంబరం కంట కన్నీరు.. అక్మడ ఉండడం వల్లే శరీరం గట్టిపడిందంటూ..

కొన్ని ప్రాంతాల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను శిక్షించండి అంటూ ప్రజలు బ్యానర్లను ప్రదర్శించారు. యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఫలితం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ నెల 9న ఫలితాలు విడుదల కానున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు కోర్టులో ఉన్నందున 15 అసెంబ్లీ స్థానాల్లోనే ఎన్నికలు నిర్వహించారు.

కాంగ్రెస్, బీజేపీ 15 స్థానాల్లో, జేడీఎస్ 12, బీఎస్‌పీ 2, ఎన్‌సీపీ ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది.

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాయి. అనర్హత ఎమ్మెల్యేలంతా బీజేపీ నుంచి బరిలోకి దిగారు. అయితే ఫలితాల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌లు మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also read:కర్ణాటక ఉప ఎన్నికలు: పోలింగ్ ప్రారంభం

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 105, కాంగ్రెస్ 66, జేడీఎస్ 34, బీఎస్పీ 1, ఒక స్వతంత్ర, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉండగా మరో ఎనిమిది మంది కావాలి. 
 

click me!