Karnataka Bandh : నేడే కర్ణాటక బంద్.. విద్యాసంస్థలపై ఎఫెక్ట్.. పోలీసుల ముందస్తు జాగ్రత్తలు

Published : Sep 29, 2023, 05:46 AM IST
Karnataka Bandh : నేడే కర్ణాటక బంద్.. విద్యాసంస్థలపై ఎఫెక్ట్.. పోలీసుల ముందస్తు జాగ్రత్తలు

సారాంశం

Karnataka Bandh : తమిళనాడుకు కావేరీ జలాలను పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా  నేడు  (సెప్టెంబర్ 29న) బంద్ కు పిలుపునిచ్చారు. 

Karnataka Bandh : గత కొంతకాలంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక  ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటం రోజు రోజుకు ఉధృతం అవుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కన్నడ సంఘాలు, అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ..  సెప్టెంబర్ 29న కర్నాటక బంద్ కు పిలుపునిచ్చారు. రేపు బంద్ కారణంగా రాష్ట్రంలోని బెంగుళూరు లోని స్కూళ్ళు, కాలేజీలు పూర్తిగా మూసివేయాలని సూచించారు. ఈ బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండాలని బెంగుళూరు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
కన్నడ చలువళి గ్రూపు నేతృత్వంలోని కన్నడ అనుకూల సంస్థలు 29న కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈరోజు  బెంగళూరులో బంద్ జరుగుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. కర్ణాటకలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ (KAMS) కర్ణాటక బంద్‌కు మద్దతు ఇచ్చింది. అటువంటి పరిస్థితిలో సెప్టెంబర్ 29 న కూడా కళాశాలలు , పాఠశాలలు మూసివేయబడతాయని నమ్ముతారు.
 
ఓలా-ఉబర్ సేవలపై ప్రభావితం 

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్రంలో బంద్‌ నిర్వహిస్తున్నారు. బంద్‌కు మద్దతుగా Ola, Uber వంటి క్యాబ్ సేవలు సెప్టెంబర్ 29, 2023న పనిచేయవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడతాయనే ఊహాగానాలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చని పాఠశాలలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్