Telangana Cabinet:  ఇంకా జ్వరంతో బాధపడుతున్న గులాబీ బాస్.. నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా..

Published : Sep 29, 2023, 03:37 AM ISTUpdated : Sep 29, 2023, 03:38 AM IST
Telangana Cabinet:  ఇంకా జ్వరంతో బాధపడుతున్న గులాబీ బాస్.. నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా..

సారాంశం

Telangana Cabinet: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నారు. గతవారం రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది

Telangana Cabinet: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ఇంకా వైరల్ జ్వరంతోనే బాధపడుతున్నారు. గతవారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. అయితే మళ్లీ ఎప్పుడు సమావేశం జరుగనున్నదనే దానిపై మాత్రం ఏలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ భేటీ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

గత నాలుగు క్రితం.. సీఎం కేసీఆర్  జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా  సీఎం కేసీఆర్ కు యశోద వైద్యులు చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.గతంలో  ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో  కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఈ దఫా కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రగతి భవన్ లోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది

కేబినేట్ భేటీ జరిగి ఉంటే..

అక్టోబర్ రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరిగేది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ పై ప్రధానంగా చర్చ జరిగేది. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త పథకాలపై  కూడా కీలక నిర్ణయం తీసుకునే వారు. అలాగే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం  సిఫారసు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై కూడా చర్చ జరిగేది.   

వాస్తవానికి గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గత సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరిచారు. దీంతో అంశంపై తీవ్ర వివాదం నెలకొంది. గవర్నర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. తమిళిసై ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెను గవర్నర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్