‘‘రాముడు దేవుడే కాదు’’ అంటూ పుస్తకం..వివాదం

Published : Jan 02, 2019, 01:51 PM IST
‘‘రాముడు దేవుడే కాదు’’ అంటూ పుస్తకం..వివాదం

సారాంశం

‘‘రాముడు దేవుడే కాదు.. ఎందుకంటే సాధారణ మానవుల్లాగా అతను కూడా అనేక సమస్యలతో సతమతమయ్యాడు’’ అంటూ.. ఓ రచయిత రాసిన పుసక్తం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. 

‘‘రాముడు దేవుడే కాదు.. ఎందుకంటే సాధారణ మానవుల్లాగా అతను కూడా అనేక సమస్యలతో సతమతమయ్యాడు’’ అంటూ.. ఓ రచయిత రాసిన పుసక్తం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. కర్ణాటకు చెందిన రచయితన కేఎస్ భగవాన్.. తాజాగా కన్నడలో ‘రామ మందిర యేకే బేడ’ (రామ మందిర అవసరం ఏముంది?) అనే పుస్తకం రాశారు. రాముడు అసలు దేవుడే కాదనే అర్థం వచ్చేలా ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. 

కాగా.. హిందుత్వ వాదులు రచయితపై మండిపడుతున్నారు.  ఓ హిందుత్వ సంస్థ  ఇప్పటికే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి  ఫిర్యాదు మేరకు పోలీసులు భగవాన్‌పై కేసు నమోదు  చేశారు.హిందుత్వ సంస్థలకు చెందిన కొంతమంది భగవాన్‌ ఇంటి ముందు నిరసనలు కూడా చేశారు. 

మరోవైపు ఈ అంశంపై ముఖ్యమంత్రి కుమార స్వామి మౌనం వహించడంపై కర్ణాటక భాజపా మండిపడుతోంది. భగవాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ ఆ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !
Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !