మద్రాసు ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Published : Jan 02, 2019, 12:33 PM IST
మద్రాసు ఐఐటీ  విద్యార్థిని ఆత్మహత్య

సారాంశం

మద్రాస్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు పాల్పడింది. 


మద్రాస్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు పాల్పడింది. క్యాంపస్ లోని సబర్మతి హాస్టల్ లోని తన గదిలో విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిని జార్ఖండ్ కు చెందిన రంజన కుమార్ గా పోలీసులు గుర్తించారు. 

రంజన కుమార్ ఖనిజ శాస్త్రంలో పీ హెచ్ డీ చేస్తోంది.  ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లాంటిది ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ లో కేరళకు చెందిన శాహుల్ కోర్నాత్(23) ఇదే ఐఐటీ మద్రాస్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నావెల్ ఆర్కిటెక్చర్ లో శాహుల్ డిగ్రీ చేస్తున్నాడు. శాహుల్ గదిలో కూడా సూసైడ్ నోట్ లభించలేదు. 2016, జులైలో మహిళా రీసెర్చ్ స్కాలర్, ప్రొఫెసర్ భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం