ఒంటి చేత్తో మాస్కులు కుట్టిన పదేళ్ల బాలిక సింధూరి

By narsimha lode  |  First Published Jun 26, 2020, 6:19 PM IST

 కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపికి చెందిన 10 ఏళ్ల బాలిక ఒంటిచేత్తో మాస్కులు కుట్టి పలువురి మన్ననలు పొందింది.ఆరో తరగతి చదువుతున్న సింధూరి తన వంతుగా మాస్కులు కుట్టడంపై పలువురు ప్రశంసలు కురిపించారు.



ఉడిపి: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపికి చెందిన 10 ఏళ్ల బాలిక ఒంటిచేత్తో మాస్కులు కుట్టి పలువురి మన్ననలు పొందింది.ఆరో తరగతి చదువుతున్న సింధూరి తన వంతుగా మాస్కులు కుట్టడంపై పలువురు ప్రశంసలు కురిపించారు.పుట్టుకతోనే సింధూరికి ఒక్క చేయి లేదు. తాను తయారు చేసిన మాస్కులను విద్యార్థులకు అందిస్తోంది.

ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులు లక్ష ముసుగులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం సింధూరి ఒక చేత్తో ముసుగులు కుట్టడం ప్రారంభించారు.

Latest Videos

తన తల్లి సహాయంతో మాస్కులు కుట్టడం ప్రారంభించినట్టుగా  సింధూరి చెప్పారు. తొలుత మాస్కులు కుట్టడం కొంత కష్టంగా భావించినట్టుగా ఆమె తెలిపారు.12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సింధూరి మాస్కులను పంపిణీచేశారు.కరోనా నివారణకు గాను మాస్కులు ధరించడం అనివార్యం చేసింది ప్రభుత్వం.

సింధూరి గొప్ప విద్యార్థి అంటూ ఉపాధ్యాయులు ప్రశంసించారు. మౌంట్ రోజరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో స్కౌట్ గౌడ్స్ లో సింధూరి పనిచేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 17 ఏళ్ల బాలుడు తనకు దక్కిన అవార్డు డబ్బులను పీఎం కేర్స్ ఫండ్స్ కు అందించారు. 
 

click me!