వివాదంలో సిద్దూ: మైక్‌తో పాటు ఆమె చున్నీ లాగివేత(వీడియో)

Published : Jan 28, 2019, 04:26 PM ISTUpdated : Jan 28, 2019, 04:51 PM IST
వివాదంలో సిద్దూ: మైక్‌తో పాటు ఆమె చున్నీ లాగివేత(వీడియో)

సారాంశం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదంలో చిక్కుకొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఓ మహిళ ప్రశ్నించడంతో కోపంతో  ఓ మహిళ చున్నీని సిద్దరామయ్య లాగాడు.

బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదంలో చిక్కుకొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఓ మహిళ ప్రశ్నించడంతో కోపంతో  ఓ మహిళ చున్నీని సిద్దరామయ్య లాగాడు.

కర్ణాటక రాష్ట్రంలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నాడు సిద్దరామయ్య పర్యటించారు. ఈ నియోజకవర్గం నుండి సిద్దరామయ్య తనయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జమలా రాణి అనే మహిళ సిద్దరామయ్య దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన సిద్దరామయ్య ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించాడు.

తననే  నిలదీస్తావా అంటూ సిద్దరామయ్య ఆ మహిళపై విరుచుకుపడ్డారు. ఆ మహిళ  వద్ద ఉన్న మైక్‌ను లాగేసే ప్రయత్నం చేశారు. మైక్‌తో పాటు ఆ మహిళ ధరించిన చున్నీ కూడ వచ్చేసింది.  సమస్యలను పరిష్కరించాలని  ప్రస్తావించినందుకు  తనను అవమానించారని ఆ మహిళ ఆరోపిస్తోంది.

 

 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు