వికాస్ దూబేకు తగిన భార్యనే: మరో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్, రివార్డు పెంపు

By telugu teamFirst Published Jul 6, 2020, 4:09 PM IST
Highlights

కాన్పూర్ ఎన్ కౌంటర్ కు కారణమైన గ్యాంగస్టర్ వికాస్ దూబేకు ఆయన భార్య నుంచి పూర్తి సహకారం అందుతున్నట్లు తెలుస్తోంది. వికాస్ దూబే నేర కార్యకలాపాలన్నీ భార్య రిచా దూబేకు తెలుసునని అంటున్నారు.

కాన్పూర్: కాన్పూర్ ఎన్ కౌంటర్ వ్యవహారంలో మరో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కాన్పూర్ ఎదురుకాల్పుల్లో గ్యాంగస్టర్ వికాస్ దూబే ముఠా చేతిలో ఎనిమిది మంది పోలీసులు మరణించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ వేటు పడింది. 

చౌబేపూర్ పోలీసు స్టేషన్ లోని ఎస్సైలు కున్వర్పాల్, కృష్ణ కుమార్ శర్మ, కానిస్టేబుల్ రాజీవ్ లపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు కాన్పూర్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ చెప్పారు. ఎనిమిది పోలీసులు మరణించిన సంఘటనలో వారి వ్యవహారంలో ఆరోపణపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. వారు తప్పు చేసినట్లు విచారణలో తేలితే తదుపరి చర్యలు కూడా తీసుకుంటారు. 

Also Read: డీఎస్పీ దారుణ హత్య.. తల నరికి, శరీరాన్ని ముక్కలు చేసి..

కాగా, వికాస్ దూబే కార్యక్రమాలకు అతని భార్య రిచా దూబే కూడా సహకరిస్తు్నట్లు పోలీసులు చెుతున్నారు. రిచా బీహారులోని ధిమౌ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. భర్త అక్రమ కార్యకలాపాల గురించి ఆమెకు పూర్తిగా తెలుసునని అంటున్నారు. అతనికి పూర్తిగా సహకారం అందిస్తూ వస్తోందని చెబుతున్నారు. వికాస్ దూబే తన ఆస్తులను ఆమె పేరు మీదనే రిజిష్టర్ చేశాడు. 

కాగా, వికాస్ దూబే గురించి చెప్పనవారికి ఇచ్చే రివార్డును లక్ష రూపాయల నుంచి రూ.2.25 లక్షలకు పెంచారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీజీపి నిర్ణయం తీసుకున్నారు.  దూబే కుటుంబంలో 12 మందికి లైసెన్స్ ఉన్న ఆయుధాలు 12 ఉన్నాయని అంటున్నారు. వాటిని తన కోసం వాడుతూ వచ్చాడని చెబుతున్నారు. 

Also Read: కాన్పూర్ ఎన్‌కౌంటర్: 'పోలీసుల నుండే దూబేకు ముందే సమాచారం'

దూబే చివరి సారి ఔరాయిరాలో ఉన్నట్లు కనిపెట్టారు. అక్కడి నుంచి అతను మధ్యప్రదేశ్ కు గానీ రాజస్థాన్ కు గానీ వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. నేపాల్ కు పారిపోకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేశారు. 

click me!