బీజేపీలో చేరిన కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్.. హర్ట్ అయిన ప్రకాశ్ రాజ్.. ఆయన ఏమన్నారంటే?

By Mahesh K  |  First Published Apr 5, 2023, 11:53 PM IST

కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ ఈ రోజు బీజేపీలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. అయితే, ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనను తొలుత ప్రకాశ్ రాజ్ అవాస్తవమని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సుదీప్ స్టేట్‌మెంట్‌తో తాను హర్ట్ అయ్యారని వివరించారు.
 


బెంగళూరు: కన్నడ యాక్టర్, ఈగ ఫేం యాక్టర్ కిచ్చా సుదీప్ ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ క్యాంపెయిన్‌లో తాను పాల్గొంటానని కిచ్చా సుదీప్ వెల్లడించారు. అయితే, ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోనని స్పష్టత ఇచ్చారు. కిచ్చా సుదీప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకాశ్ రాజ్‌ను గాయపరిచింది.

తొలుత ఆ వార్త ఫేక్ న్యూస్ అని భావించాడు ప్రకాశ్ రాజ్. కిచ్చా సుదీప్ బీజేపీకి ప్రచారం చేస్తారనే వార్తపై రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో గెలవాలని ప్రయాస పడుతున్న బీజేపీ ప్రచారం చేస్తున్న వదంతులు ఇవన్నీ అని తాను బలంగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఎందుకంటే కిచ్చా సుదీప్ ఒక సెన్సిబుల్ సిటిజన్ అని, ఇలాంటి ఎరలకు పడిపోడని ట్వీట్ చేశారు.

"I am shocked and hurt by Kichha Suddep's statement," says actor Prakash Raj on Kannada actor Kichcha Sudeep extending his support to BJP for the upcoming

(File Pic) pic.twitter.com/8olSSfwcJ8

— ANI (@ANI)

Latest Videos

అనంతరం, ఆ వార్త నిజమేనని తెలిసినాక మరోసారి రియాక్ట్ అయ్యారు. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి మద్దతు ఇస్తానని కిచ్చా సుదీప్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఖంగు తిన్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. కిచ్చా సుదీప్ స్టేట్‌మెంట్ తనను హర్ట్ చేసిందని పేర్కొన్నారు.

Also Read: కర్ణాటకలో నేను బీజేపీకి ప్రచారం చేస్తాను.. కానీ పోటీ మాత్రం చేయడం లేదు: కిచ్చా సుదీప్ కీలక కామెంట్స్

ఈ రోజు కిచ్చా సుదీప్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పక్కనే కూర్చుని విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాను తన రుణాన్ని చెల్లిస్తున్నానని అన్నారు. ఇది పార్టీ గురించి కాదని, కానీ, సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు తనకు అండగా నిలబడిన ఎందరి కోసమో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. తనకు అండగా నిలబడిన వారిలో బసవరాజ్ బొమ్మై కూడా ఉన్నారని తెలిపారు. ఈ రోజు తాను పార్టీ కోసం కాకుండా.. బొమ్మై కోసమే అక్కడకు వచ్చినట్టు వివరిచారు. బీజేపీకి క్యాంపెయిన్ చేయడానికి కేవలం బొమ్మై కారణం అని ఆయనకు చెప్పినట్టు సుదీప్ అన్నారు.

click me!