అసహజ శృంగారానికి పట్టు, మర్మాంగాలపై గాయాలు: భర్తను చంపిన లేడీ టీచర్

Published : Aug 02, 2020, 07:57 AM IST
అసహజ శృంగారానికి పట్టు, మర్మాంగాలపై గాయాలు: భర్తను చంపిన లేడీ టీచర్

సారాంశం

తాగొచ్చి అసహజ శృంగారానికి పట్టబడుతూ వస్తున్న భర్తను ఓ మహిళా టీచర్ హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తొలుత ప్రమాదంగా చిత్రీకిరంచిన ఆమె చివరకు పోలీసులకు పట్టుబడింది.

మదురై: ఓ మహిళా టీచర్ తన 34 ఏళ్ల ఇంజనీరు భర్తను చంపేసింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నందుకు ఆగ్రహించి తన బంధువుల సహకారంతో ఆమె అతన్ని చంపేసింది. మృతుడిని తిరుమంగలానికి చెందిన ఈ సుందర్ అలియాస్ సుదీర్ గా గుర్తించారు. 

సుందర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎస్ అరివుల్ సెల్వం (31)ను ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పడకపై నుంచి పడి స్పృహ కోల్పోయాడని చెప్పి సుందర్ ను అరివుల్ సెల్వం ఆస్పత్రికి తీసుకుని వెల్లింది. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు. 

గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతని మర్మాంగాలపై గాయాలు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సుందర్ సమీప బంధువు సోమసుదరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు .

తానే భర్తన చంపినట్లు విచారణలో భార్య అంగీకరించింది. బీ బాలమణి, ఆమె కుమారుడు సుమైర్ ల సహకారంతో సుందర్ ను హత్య చేసినట్లు అరివుల్ సెల్వం అంగీకరించింది. 

మద్యం సేవించి వచ్చి అసహజ శృంగారానికి పట్టుబట్టేవాడని, దాంతో విసుగు చెంది చంపేశానని ఆమె చెప్పింది. తాను అంగీకరించకపోతే బలవంతంగా లాక్కునేవాడని చెప్పింది. పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చినట్లు, అది తాగి అతను స్పృహ తప్పి పడిపోయాడని చెప్పింది. ఆ తర్వాత బాలమణిని, సుమైర్ ను పిలిచి వారి సహాయంతో తలను ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu