మానస సరోవర్: ఐదుగురు యాత్రికుల మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

First Published Jul 4, 2018, 10:40 AM IST
Highlights

అమర్‌నాథ్ యాత్ర: కొనసాగుతున్న సహాయక చర్యలు


న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకొన్నవారికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి, అనారోగ్యం కారణంగా ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడిన వారిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. 

మానససరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులకు వాతావరణం అనుకూలించని కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యాత్రికులు వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. అయితే కొండచరియలు విరిగిపడిన కారణంగా ముగ్గురు  అనారోగ్యం, గుండెపోటుతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లుకు చెందిన తోట రత్నం,  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన  కాకినాడకు చెందిన సుబ్బారావు మృత్యువాత పడినట్టు అధికారులు తెలిపారు. సుబ్బారావు మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు  అప్పగించారు.

వాతావరణం అనుకూలించని కారణంగా ఐదు రోజులుగా బేస్‌ క్యాంపులోనే తెలుగు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. సహాయక శిబిరాల్లో సరైన సౌకర్యాలు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పర్వత ప్రాంతాల్లోనే ఇంకా 1300 మంది యాత్రికులు ఉన్నారు. అయితే ఇప్పటికే 96 మంది యాత్రికులను సర్జేత్‌కు తరలించారు. సిమికోట్ నుండి నేపాల్‌గంజ్‌కు కూడ శిబిరాల్లో ఉన్న యాత్రికులను తరలించారు.

పర్వతప్రాంతాల్లోనే ఉన్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మానస సరోవర్ యాత్ర ప్రాంతానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  బుధవారం నాడు  వెళ్లనున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు.

click me!