పుగైలాయిపట్టిలో ఘ‌నంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం.. 23 మందికి గాయాలు

Published : Feb 16, 2023, 11:05 AM ISTUpdated : Feb 16, 2023, 11:14 AM IST
పుగైలాయిపట్టిలో ఘ‌నంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం.. 23 మందికి గాయాలు

సారాంశం

Chennai: తేని జిల్లా ఉత్తమపాళ్యం సమీపంలోని పల్లవరాయణపట్టిలో శ్రీ పురకథమ్మ, శ్రీ వల్లడికరస్వామి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకుని జల్లికట్టు పోటీలు ఘనంగా జరిగాయి. మ‌ధురై, శివగంగై, పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, తిరునల్వేలితో పాటు తేని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన‌ ఎద్దులు, ప్రజలతో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

23 people injured in Jallikattu: త‌మిళ‌నాడులోని దిండిగల్ జిల్లా పుగైలాయిపట్టిలో జరిగిన జల్లికట్టు పోటీల్లో 23 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మ‌ధురై, అలంకనల్లూరు సహా దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో జల్లికట్టు, మంజువిరట్టు పోటీలు జరుగుతాయి. దిండిగల్ జిల్లాలోని పుగైలాయిపట్టిలోని సెయింట్ సంత్యకపర్, సెయింట్ సెబాస్టియన్ ఆలయ ఉత్సవం (St. Santhyakapar and St. Sebastian temple festival) సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్క‌డ ఈ పోటీలు నిర్వహిస్తారు. తమిళనాడులోని వివిధ జిల్లాల్లో జరిగే జల్లికట్టు పోటీల్లో పెద్ద సంఖ్యలో ఎద్దుల పందెం క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటారు. దిండిగల్ జిల్లా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ పుగైలాయిపట్టి  గ్రామంలో జల్లికట్టు పోటీలు నిర్వహించిన‌ట్టు తెలిపారు. ఈ జ‌ల్లిక‌ట్టు పోటీల‌లో 23 మంది గాయపడ్డారని తెలిపిన ఆయ‌న‌.. ఆస్ప‌త్రిలోచేర్పించ‌గా వారిలో 17 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్ర‌స్తుతం ఆరుగురు దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

జల్లికట్టు పోటీల కోసం 490 ఎద్దులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోగా 483 ఎద్దులు పాల్గొన్నాయి. డాక్టర్ అశోకుమార్ నేతృత్వంలోని వైద్య బృందం 214 ఎద్దులను పరీక్షించి ఒక్కో రౌండ్ కు 25 ఎద్దులను అనుమతించింది. తమిళనాడులోని మ‌ధురైలోని మూడు గ్రామాల్లో 'ఏరు తజువుతల్', 'మంకువిరట్టు' అని కూడా పిలువబడే జల్లికట్టు కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా ప్రారంభమ‌య్యాయి. 

రెండేళ్ల తర్వాత పల్లవరాయణపట్టిలో జల్లికట్టు క్రీడ‌లు

తేని జిల్లా ఉత్తమపాళ్యం సమీపంలోని పల్లవరాయణ‌ పట్టిలో రెండేండ్ల త‌ర్వాత‌ జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. తేని జిల్లా ఉత్తమపాళ్యం సమీపంలోని పల్లవరాయణపట్టిలో శ్రీ పురకథమ్మ, శ్రీ వల్లడికరస్వామి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకుని జల్లికట్టు పోటీలు ఘనంగా జరిగాయి. మ‌ధురై, శివగంగై, పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, తిరునల్వేలితో పాటు తేని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన‌ ఎద్దులు ఈ జల్లికట్టు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని తేని జిల్లా కలెక్టర్ షాజీవన, ఎమ్మెల్యే రామకృష్ణన్, ఆండిపట్టి ఎమ్మెల్యే మహారాజన్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ డోంగ్రే ప్రవీణ్ ఉమేష్ కూడా పాలుపంచుకున్నారు.  జల్లికట్టు పోటీల్లో తొలి ఎద్దుగా ఆలయ ఎద్దును పంపించారు. అనంతరం వరుసగా ఎద్దులను విడిచిపెట్టారు. రెచ్చిపోతున్న ఎద్దులను అందులో పాల్గొన్నవారు ఉత్సాహంగా వాటిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. జల్లికట్టు సందర్భంగా 750 మంది పోలీసులతో భద్రతా విధులు నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!