
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళీ మాతపై వచ్చిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో అలజడి రేపిన సంగతి తెలిసిందే. కాళీ మాత వేషం వేసిన మహిళ ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని మరో చేతిలో ఎల్జీబీటీక్యూ ప్లస్ జెండా పట్టుకుని కనిపించింది. ఈ పోస్టర్‌పై వివాదం రేగింది. తాజాగా, ఇదే వివాదంపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్ర మంగళవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తన వరకైతే.. కాళీ మాత మాంసం భుజించే మద్యం స్వీకరించే దేవత అని సంచలనానికి తెర లేపారు. మన దేవుడిని మనం ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. కొన్ని చోట్ల దేవుళ్లకు విస్కీతో మొక్కే వారు ఉన్నారని, మరికొన్ని చోట్లా ఈ ఆచారం తీవ్ర వ్యతిరేకమైనదిగా ఉన్నదని వివరించారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2022లో మహువా మోయిత్ర ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఓ మూవీ పోస్టర్‌పై కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు ఉండటంతో వివాదం రేగిందని, ఆ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా.. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈ పోస్టర్ హిందూ దేవతలకు అవమానకరం అని, మతపరమైన ఉద్వేగాలను గాయపరుస్తున్నదని కొందరు వాదనలు చేశారు. ఫిలిం మేకర్ లీనా మనిమేకలై ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేయగానే వివాదం రేగింది. ఈ డాక్యుమెంటరీ ఫిలింపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కొందరైతే.. ఆ ఫిలిం మేకర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ కూడా చేశారు.
ప్రముఖ ఫిల్మ్ మేకర్ లేనా మణిమేకలై రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించి ఇటీవలే ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే, దీనిని పై ప్రజల నుంచి పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమాజిక మాధ్యమాలల్లో చిత్ర బృందంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రోల్ చేయడం మాములుగా లేదు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ట్రెంగ్ కావడం గమానర్హం. హిందూవులమనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ.. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ పోస్టర్ లో కాళీమాత రూపంలో ఓ మహిళ చేతితో త్రిశూలం పట్టుకుని ఉండటంతో పాటు మరో చేతితో సిగరెట్ పట్టుకుని తాగుతున్నట్టుగా ఉంది. దీంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా పలువురి నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. దీంతో చిత్ర బృందానికి సంబంధించిన ముగ్గురిపై కేసు నమోదుచేశారు. యూపీ పోలీసులు చిత్రనిర్మాత, అసోసియేట్ నిర్మాత, ఎడిటర్లపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), IT (సవరణ) చట్టం 2008లోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. "నేరపూరిత కుట్ర, ప్రార్థనా స్థలంలో నేరం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యం వంటి ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్" ను నమోదుచేశారు. చిత్రనిర్మాత లీనా మణిమేకలైతో పాటు, డాక్యుమెంటరీ అసోసియేట్ ప్రొడ్యూసర్, ఆశా, ఎడిటర్ శ్రవణ్ ఒనాచన్ గా పేర్కొన్నారు.