Earthquake: 24 గంట‌ల్లో 22 భూకంపాలు.. అండ‌మాన్ స‌ముద్రంలో వ‌రుస ప్ర‌కంప‌న‌లు

Published : Jul 05, 2022, 02:09 PM IST
Earthquake: 24 గంట‌ల్లో 22 భూకంపాలు.. అండ‌మాన్ స‌ముద్రంలో వ‌రుస ప్ర‌కంప‌న‌లు

సారాంశం

Earthquake: అండ‌మాన్ స‌ముద్రంలో వ‌రుస ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. కేవ‌లం 24 గంట‌ల్లో 22కు పైగా భూకంపాలు సంభ‌వించాయ‌ని ఎన్‌సీఎస్ వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11.03 గంటలకు అసోంలో కూడా 3.7 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది.   

22 earthquakes in 24 hours: అండ‌మాన్ స‌ముద్రంలో వ‌రుస ప్ర‌కంప‌న‌లు వ‌స్తుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. సోమవారం ఉదయం నుండి పోర్ట్ బ్లెయిర్ తీరంలో 22 భూకంపాలు సంభవించాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కేవ‌లం 24 గంట‌ల్లో 22కు పైగా భూకంపాలు సంభ‌వించాయ‌ని ఎన్‌సీఎస్ వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11.03 గంటలకు అసోంలో కూడా 3.7 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. అయితే, ఈ భూకంపాల కార‌ణంగా ఇప్పటివ‌ర‌కు ఎలాంటి న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. 

విరాల్లోకెళ్తే.. అండమాన్ సముద్రంతో సోమవారం ఉదయం 5.42 గంటల నుండి 20 భూకంపాలు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.8 నుండి 5.0 వరకు తీవ్ర‌త నమోదయింది. ఈ ఉదయం 4.3 తీవ్రతతో భూకంపం దక్షిణ పోర్ట్ బ్లెయిర్ తూర్పు తీరం 187 కి.మీ దూరంలో ఉదయం 8.05 గంటలకు సంభవించింది. అలాగే, పోర్ట్ బ్లెయిర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 215 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.57 గంటలకు 5.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఈ వ‌రుస‌లో అతిపెద్దది. ఈ వ‌రుస ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్పటివరకు ఎలాంటి అస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించలేదు. ఈరోజు ఇప్పటివరకు 11 భూకంపాలు నమోదయ్యాయి. 12.03 గంటలకు 4.6 తీవ్రతతో కూడిన భూకంపం సంభ‌వించింది. అంతకు ముందు తెల్లవారుజామున 4.45 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 

అలాగే, తెల్లవారుజామున 2.54 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 244 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 2.13 గంటలకు, క్యాంప్‌బెల్ బేకు ఉత్తర-ఈశాన్యంగా 251 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం, పోర్ట్బ్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 261 కిలోమీటర్ల దూరంలో 1.48 గంటలకు  4.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 1.30 గంటలకు, క్యాంప్‌బెల్ బేకు ఉత్తరాన 262 కి.మీ దూరంలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు, పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 258 కి.మీ దూరంలో తెల్లవారుజామున 1.07 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం సంభవించగా, పోర్ట్ బ్లెయిర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 199 కి.మీ దూరంలో 12.46 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. 12.03 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 218 కి.మీ దూరంలో 4.6 తీవ్రతతో భూకంపం నమోదైంది.

ఈ వరుస భూకంపాలు ఎందుకు వ‌స్తున్నాయ‌నే దానిపై ఆందోళ‌న వ్య‌క్తమవుతోంది. గత కొన్ని రోజులుగా క‌ర్నాట‌కలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా శనివారం మధ్యాహ్నం 1.25 గంటలకు విజయనగర సమీపంలో 2.1 తీవ్రతతో నమోదైంది. దక్షిణ కన్నడ జిల్లాలోని సుల్లియా తాలూకాలో కూడా 2.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జూన్ 25 నుంచి తాలూకాలో నాలుగోసారి ప్రకంపనలు వచ్చాయి. "ఈ రకమైన భూకంపం స్థానిక సమాజానికి ఎటువంటి హాని కలిగించదు... స్వల్పంగా  కంప‌న‌లు ఉండవచ్చు.. భూకంపాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువ మరియు నష్టం జరిగే అవకాశం తక్కువ" అని రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ మనోజ్ రాజన్ చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ఉదయం 11.03 గంటలకు అసోంలో కూడా 3.7 తీవ్రతతో భూకంపం నమోదైంది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu