న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది: CJI NV RAMANA

Published : Dec 26, 2021, 01:52 PM IST
న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది: CJI NV RAMANA

సారాంశం

న్యాయ‌వ్య‌వ‌స్థ ఎన్నో స‌వాళ్లును స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయ‌న నేడు విజ‌య‌వాడ‌లోని కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో జ‌రిగిన‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో  సీజేఐ  పాల్గొన్నారు. ఈ సభలో సీజేఐ భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై ప్ర‌సంగించారు.   

న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటుందనీ, రాజ్యాంగ పరిరక్షణలో కోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయ‌ని , కొత్త సవాళ్లను అధిగమించేందుకు దృష్టి సారించింద‌ని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. నేడు ఏపీలోని విజయవాడ కానూరు సిద్ధార్థ కళాశాలలో  జ‌రిగిన లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో  సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సభలో సీజేఐ భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై ప్ర‌సంగించారు. 

ఇటీవలి కాలంలో జ్యుడీషియల్ అధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని, పార్టీలకు అనుకూలమైన ఉత్తర్వులు రాకపోతే న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ఆస‌త్య‌ ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.  పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్య‌వ‌హరించాలి. కానీ,  వారు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. దీంతో న్యాయ వ్య‌వ‌స్థ‌  స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందని అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వారు కోర్టుల‌కు మాత్ర‌మే జ‌వాబుదారీగా ఉండాల‌ని  పేర్కొన్నారు. 

Read Also: చంద్రబాబుకు షాక్ తప్పదా...? వంగవీటి రాధతో వల్లభనేని వంశీ భేటీ (వీడియో)


మ‌రోవైపు.. న్యాయవ్యవస్థపై జరిగే ద్వేషపూరిత దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, కోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప, అధికారులు సాధారణంగా దర్యాప్తును కొనసాగించకపోవడం దురదృష్టకరమని సీజేఐ అన్నారు. న్యాయమూర్తులు,  న్యాయాధికారులు నిర్భయంగా పని చేసేలా సురక్షితమైన వాతావరణం ఏర్పాడాల‌ని అన్నారు. 

Read Also: Peddapalli:పండంటి బిడ్డకు జన్మనిచ్చి... హాస్పిటల్ బాత్రూంలోనే బాలింత ఆత్మహత్య (Video)
 

చట్టాల రూప‌క‌ల్ప‌న‌లోనే .. త‌రువాత త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ను సమర్థవంతమైన పరిష్కారడానికి.. అనుకునంగా మార్పులు చేసుకునేలా  చ‌ట్టాల‌ను రూపొందించాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలో 2016లో తీసుకోవ‌చ్చిన బీహార్ ప్రొహిబిషన్ యాక్ట్‌ను ఉటంకించారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు సుప్రీంకోర్టుల్లో  పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు . ఈ పెండింగ్ కేసులో దాదాపు 46 శాతం  కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే అన్నారు. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాలే ఉంటున్నాయి అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?