బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. 6 గురు మృతి

By team teluguFirst Published Dec 26, 2021, 1:26 PM IST
Highlights

బీహార్ లోని ఓ నూడూల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 గురు అక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Muzaffapur boiler blast : బీహార్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్‌పూర్ స‌మీపంలోని ఓ ఫ్యాక్ట‌రీలో పేలుడు భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 6 గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ను జిల్లా ఎస్పీ నిర్ధారించారు. ముజ‌ఫ‌ర్‌పూర్ ద‌గ్గ‌ర్ల లో ఓ నూడుల్స్  ఫ్యాక్ట‌రీ ఉంది. ఆదివారం ఉద‌యం యాథావిధిగా ఫ్యాక్ట‌రీలో ప‌నులు జ‌రుగుతుండ‌గా ఒక్క సారిగా బాయిల‌ర్ పేలిపోయింది. దీంతో అక్క‌డే ఉన్న ఆరుగురు వ్య‌క్తులు మృతి చెందారు. మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. భారీ పేలుడు కావ‌డంతో శ‌బ్ధం 5 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న స‌మీప గ్రామాల‌కు వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆయా స‌మీప ప్రాంతాల నుంచి వంద‌లాది మంది ప‌రిగెత్తుకుంటూ ఫ్యాక్ట‌రీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఇప్ప‌టికీ పేలిన ఆ బాయిల‌ర్ నుంచి పొగ‌లు వ‌స్తున్నాయి. 

‘యావరేజ్ స్టూడెంట్‌ ఏదీ సాధించలేడనుకోవడం తప్పు’.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లేఖను గుర్తు చేసిన ప్రధాని

ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ ఫ్యాక్ట‌రీలో ఎంత మంది ప‌ని చేస్తున్నారో ఇంకా తెలియ‌రాలేదు. మంట‌ల‌ను ఆర్పేందుకు 5 ఫైర్ ఇంజ‌న్లు రంగంలోకి దిగాయి. ఈ పేలుడు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న సంస్థలు కూడా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. 

click me!