Disha Accused Encounter: తెలంగాణ పోలీసులపై పొగడ్తలు , యూపీ పోలీసులకు మాయావతి చురకలు

By Nagaraju penumalaFirst Published Dec 6, 2019, 12:50 PM IST
Highlights

తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య ఘటన కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

తెలంగాణ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని మాయావతి కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలంటూ మాయావతి వ్యాక్యానించారు. 

తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని మాయావతి స్పష్టం చేశారు. 

తెలంగాణ పోలీసులులా నిర్భయ కేసులో పోలీసులు ధైర్యం చేసి ఉంటే ఆమె తల్లిదండ్రులకు ఎప్పుడో న్యాయం జరిగేదని మాయావతి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా యూపీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. యూపీ ప్రభుత్వం మెుద్దు నిద్రపోతుందంటూ ధ్వజమెత్తారు మాయావతి. నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేన్నారు. 

అయితే బీజేపీ ప్రభుత్వం నేరస్థులను తమ బంధువులుగా చూస్తోందని అందువల్లే నేరస్థులు తప్పించుకుంటున్నారని ఆమె వాపోయారు. సిగ్గుపడాల్సిన విషయం అంటూ విరుచుకుపడ్డారు మాయావతి.

దిశ నిందితుల ఎన్ కౌంటర్: ఎన్ కౌంటర్ జరిగిన చోటే పోస్టుమార్టం...

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 
Disha accused encounter: దేశవ్యాప్తంగా సంబరాలు, దిశ కాలనీలో

 

click me!