Karnataka: దమ్ముంటే బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయండన్న బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇదే

By Mahesh KFirst Published May 27, 2023, 3:34 PM IST
Highlights

దమ్ముంటే బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయండి అంటూ కర్ణాటక బీజేపీ నేతలు పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సవాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒక్కసారి శాంతి సామరస్యతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించండి.. రాజ్యాంగ శక్తి ఏమిటో చూపిస్తామని పేర్కొంది.
 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను బ్యాన్ చేయడానికైనా సిద్ధం అంటూ ఓ ప్రకటన చేసింది. ఈ హామీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా బీజేపీ ఈ హామీని సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత కూడా బీజేపీ పలుమార్లు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేసింది. దమ్ముంటే కాంగ్రెస్ బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని సవాల్ చేస్తున్నది. పలుమార్లు ఈ సవాళ్లు విన్న తర్వాత తాజాగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను పునరుద్ఘాటించారు.

సిద్దరామయ్య మంత్రివర్గంలో ప్రియాంక్ ఖర్గే ఉన్నారు. క్యాబినెట్ మంత్రి అయినా.. ఇంకా పోర్ట్‌ఫోలియో కేటాయించలేదు.

తాజాగా ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలని బీజేపీ నేతలు పలుమార్లు సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అంధుల పాలనలో దీర్ఘకాలం ఆటాడుకున్నట్టు కాదని తెలిపారు. ఇప్పుడు మీరు ఒక్కసారి సమాజంలో నెలకొన్న శాంతి సామరస్యాలను ఒక్కసారి ఉల్లంఘించే ప్రయత్నం చేయండి.. చావుపై రాజకీయాలు చేయండి.. లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేయండి.. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ శక్తిని మీకు చూపిస్తాం’ అని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు.

Also Read: పాక్‌తో లింక్..! సారే జహాసే అచ్ఛా గీత రచయిత ముహమ్మద్ ఇక్బాల్ పాఠం తొలగింపు..! డీయూ కౌన్సిల్ తీర్మానం

సమాజంలో అశాంతి, సామరస్యతకు విరుద్ధమైన విత్తనాలను నాటితే.. అలాంటి సంస్థలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మే 25వ తేదీన ప్రియాంక్ ఖర్గే పేర్కొన్న సంగతి తెలిసిందే.

click me!