వారు ఎంత దూరం వెళతారు? : నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సిఎంలపై విరుచుకుపడ్డ బిజెపి...

Published : May 27, 2023, 03:17 PM ISTUpdated : May 27, 2023, 03:20 PM IST
వారు ఎంత దూరం వెళతారు? : నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన  సిఎంలపై విరుచుకుపడ్డ బిజెపి...

సారాంశం

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. వీరిమీద బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుపడింది..

న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరించిన ముఖ్యమంత్రులపై బీజేపీ విరుచుకుపడింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా పలు అంశాలపై చర్చించే సమావేశం శనివారం ఇక్కడ ప్రారంభమైంది.

విలేఖరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధి లక్ష్యంగా, ఫ్రేమ్‌వర్క్, రోడ్ మ్యాప్‌ను నిర్ణయించడానికి పనిచేసే కీలకమైన సంస్థ నీతి ఆయోగ్ అని అన్నారు.

ప్రధాని అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం : బహిష్కరించనున్న ఆప్, టీఎంసీ ..

నీతి ఆయోగ్ ఎనిమిదో పాలక మండలి సమావేశంలో 100 అంశాలపై చర్చించాలని ప్రతిపాదించామని, అయితే ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావడం లేదని ఆయన అన్నారు.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ హాజరుకాలేదు. 100 అంశాలపై చర్చ జరగాల్సిన సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదని, ఇంత పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రులు పాల్గొనకపోతే తమ రాష్ట్రాల వాణిని వినిపించడం లేదని ప్రసాద్ అన్నారు.

ఇది చాలా దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం, ప్రజా వ్యతిరేకం అని ఆయన అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించడంలో మీరు ఎంత వరకు వెళ్తారు’ అని బీజేపీ నేత ప్రశ్నించారు. "ప్రధాని మోడీని ఎదిరించేందుకు మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ మీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు నష్టం కలిగిస్తున్నారు?" అని ప్రశ్నించాడు.

ఎనిమిది మంది ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరించే ఈ నిర్ణయం "పూర్తిగా బాధ్యతారాహిత్యం", "ప్రజా ప్రయోజనాలకు, వారి రాష్ట్రాల్లో వారు పాలించే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం" అని ప్రసాద్ అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu