అతిక్ అహ్మద్ తరహాలోనే.. యూపీ కోర్టులో ఇద్దరు హత్యా నిందితులపై దుండగుల కాల్పులు..

Published : May 17, 2023, 08:53 AM IST
అతిక్ అహ్మద్ తరహాలోనే.. యూపీ కోర్టులో ఇద్దరు హత్యా నిందితులపై దుండగుల కాల్పులు..

సారాంశం

యూపీలోని జౌన్ పూర్ లో ఉన్న కోర్టు ప్రాంగణంలో ఇద్దరు హత్యా నిందితులపై ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణం అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కాల్పులు జరిపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

అతిక్ అహ్మద్, అతడి సోదరుడిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిగిన ఘటన ఇంకా మర్చిపోకముందే అదే రాష్ట్రంలో ఆ తరహా ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ కోర్టు ఆవరణలో మంగళవారం విచారణకు తీసుకువచ్చిన ఇద్దరు హత్య నిందితులపై ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. విష వాయువులు పీల్చి ఇద్దరు మృతి..

మే 6వ తేదీన ధర్మాపూర్ లో రెజ్లర్ బాదల్ యాదవ్ హత్యకు గురయ్యారు. అయితే అతడి హత్య కేసులో సూర్యప్రకాశ్, మిథిలేష్ గిరిలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో నిందితులను పోలీసులు జౌన్ పూర్ లో ఉన్న దివానీ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే కోర్టు ప్రాంగణంలోనే ఇద్దరు వ్యక్తులు అతడిపైకి తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కరీంనగర్ లో విషాదం.. నెలల క్రితం కోడలు, మూడు రోజుల కిందట కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక తల్లి మృతి..

ఈ ఘటన జరిగిన వెంటనే కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు కాల్పులు జరిపిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులిద్దరినీ పోలీసులు సమీపంలోని జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వరసానికి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. కాగా.. షూటర్లను పోలీసులు విచారిస్తున్నారు. వారు ఎవరు ? ఎందుకు హత్య కేసులోని నిందితులను కాల్చారనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. 5 గురు మృతి..

గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లను గత నెలలో పోలీసు కస్టడీలో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా వారిపై కాల్పులు జరిగాయి. ప్రస్తుత ఘటన ఆ హత్యలను పోలి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..