సీఎంకు చల్లారిన చాయ్ ఇచ్చాడని అధికారికి షోకాజ్ నోటీసులు.. సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఉపసంహరణ

Published : Jul 13, 2022, 12:02 AM IST
సీఎంకు చల్లారిన చాయ్ ఇచ్చాడని అధికారికి షోకాజ్ నోటీసులు.. సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఉపసంహరణ

సారాంశం

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చల్లటి చాయ్ అరేంజ్ చేశారన్న ఆరోపణలతో ఓ జూనియర్ సప్లై ఆఫీసర్‌కు షోకాజు నోటీసులు వచ్చాయి. ఈ నోటీసుల కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఫైర్ అయ్యారు. అనంతరం ఆ నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.  

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చల్లారిన చాయ్‌ను అరేంజ్ చేశాడనే ఆరోపణలతో ఓ అధికారికి షోకాజ్ నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు నోటీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అధికారులు ఆ నోటీసులను వెనక్కి తీసుకున్నారు.

ఛతర్‌పూర్ జిల్లాలో ఖజురహో ఎయిర్‌పోర్టుకు సీఎం శివరాజ్ వస్తున్నారని అక్కడ ఆయనకు అల్పాహారం, టీ సప్లై చేసే బాధ్యతలను జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కన్హువాకు రాజ్‌నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ డీపీ ద్వివేది అప్పగించారు. 

సీఎం శివరాజ్ సింగ్ సోమవారం ఖజురహో విమానాశ్రయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లు చేశారు. అయితే, సోషల్ మీడియా జూనియర్ సప్లై ఆఫీసర్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని ఛతర్‌పూర్ జిల్లా కలెక్టర్ సందీప్ జీఆర్ రద్దు చేశారు. ఆ తర్వాత ద్వివేది వివరణ ఇచ్చారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కన్హువా అరేంజ్ చేసిన టీ, బ్రేక్ ఫాస్ట్‌ను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకోలేదని తెలిపారు. ఎందుకంటే.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిర్‌పోర్టులో ఆగలేదని, ఎయిర్ క్రాఫ్ట్ చేంజ్ చేసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సీఎం చౌహాన్ రేవాకు వెళ్తూ ఈ దారి గుండా ప్రయాణించారు. 

ఖజురహో ఎయిర్‌పోర్టులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగుతారనే ఉద్దేశంతో టీ, బ్రేక్ ఫాస్ట్ అరేంజ్ చేయాలని ద్వివేది సోమవారం ఉదయం 11.30 గంటలకు కన్హువాను ఆదేశించారు. కానీ, కన్హువా చల్లారని, నాణ్యత లేని చాయ్‌ని అరేంజ్ చేశారని ద్వివేది తెలిపారు. 

దీని ద్వారా జిల్లా యంత్రాంగానికి చెడ్డ పేరు వచ్చేదని, వీవీఐపీలకు సంబంధించిన ప్రొటోకాల్ పాలనపైనా అనుమానాలు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. అందుకే మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జూనియర్ సప్లై ఆఫీసర్‌కు నోటీసులు పంపారు. తర్వాత ఈ నోటీసులను కలెక్టర్ రద్దు చేశారు.

ప్రజలు ఆహార కొరతతో, అంబులెన్స్ సేవలు అందిరాక బాధపడుతున్నా సరే.. సీఎంకు మాత్రం చల్లటి చాయ్ అందించరాదని పేర్కొంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలూజా విమర్శలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్