మరో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం.. 24 రోజుల్లో తొమ్మిదో ఘటన

Published : Jul 12, 2022, 05:11 PM IST
మరో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం..  24 రోజుల్లో తొమ్మిదో ఘటన

సారాంశం

మరో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసకుంది. దీంతో దుబాయ్ నుంచి మధురై వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యంగా బయలుదేరింది.  24 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొమ్మిదవది.

మరో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసకుంది. దీంతో దుబాయ్ నుంచి మధురై వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యంగా బయలుదేరింది.  24 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొమ్మిదవది. సోమవారం VT-SZK రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బోయింగ్ B737 మ్యాక్స్ విమానం సోమవారం మంగళూరు నుంచి దుబాయ్ వెళ్లింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత.. ఆ సర్వీస్ అక్కడి నుంచి మధురైకి రావాల్సి ఉంది. అయితే
అక్కడ విమానాన్ని తనిఖీ చేసిన ఇంజనీర్.. విమానం ముందు చక్రాలు సాధారణం కంటే ఎక్కువగా కుదించబడిందని గుర్తించినట్టుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు PTIకి తెలిపారు.

దీంతో విమానాన్ని గ్రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్పైస్‌జెట్ దుబాయ్ నుంచి మధురై‌కు విమానాన్ని నడిపేందుకు.. ముంబై నుంచి దుబాయ్‌కి మరొక విమానాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యమైందని స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది.

‘‘2022 జులై 11న దుబాయ్ నుంచి మధురైకి వెళ్లే స్పైస్‌జెట్ ఫ్లైట్ చివరి నిమిషంలో సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైంది. వెంటనే ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను భారత్‌కు తీసుకొచ్చారు. ఏ ఎయిర్‌లైన్‌లో అయినా విమాన ఆలస్యం జరగవచ్చు. ఎటువంటి సంఘటన జరగలేదు’’ అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపారు.

ఇక, జూన్ 19 నుంచి స్పైస్‌జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలకు సంబంధించిన సంఘటనల నేపథ్యంలో డీజీసీఏ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుర‌క్షిత‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన‌, న‌మ్మ‌క‌మైన సేవ‌ల్ని క‌ల్పించ‌డంలో స్పైస్‌జెట్ సంస్థ విఫ‌ల‌మైన‌ట్లు పేర్కొంది. ఇటీవల చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలపై వివరణ కోరింది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌