ఢిల్లీ అల్లర్లపై విచారణ... రాత్రికి రాత్రే హైకోర్టు న్యాయమూర్తి బదిలీ

By telugu news teamFirst Published Feb 27, 2020, 9:19 AM IST
Highlights

అలర్లపై అర్థరాత్రి విచారణ చేపట్టిన ఆయన్ను 24 గంటలు గడవకముందే పంజాబ్, హర్యాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయ మంత్రిత్వ శాఖ నోటీఫికేషన్ జారీ చేసింది.

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల కేసు విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ రాత్రికి రాత్రే బదిలీ అయ్యారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక దారులతో మూడు రోజులుగా దేశ రాజధాని అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు దాడుల కారణంగా 20మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఈ ఘటనపై హైకోర్టులో విచారణ చేపట్టారు.

ఈ కేసు విచారణలో భాగంగా అల్లర్లను నివారించడంలో పోలీసుల వైఫల్యం, బీజేపీ నేతలపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన కొద్ది గంటలకే ఆయన బదిలీ కావడం గమనార్హం.

అలర్లపై అర్థరాత్రి విచారణ చేపట్టిన ఆయన్ను 24 గంటలు గడవకముందే పంజాబ్, హర్యాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయ మంత్రిత్వ శాఖ నోటీఫికేషన్ జారీ చేసింది.

Also Read రెచ్చగొట్టే ప్రసంగాలు: హైకోర్టులో మరో ఇద్దరు బిజెపి నేతల వీడియోల

దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్‌పై అర్ధరాత్రి తన నివాసంలో ఆయన విచారణ చేపట్టారు. ఈ పిటీషన్‌పై బుధవారం తెల్లవారు జామున 1:42 నిమిషాలకు జస్టిస్ ఎస్ మురళీధర్ తన అధికారిక నివాసంలో మరో న్యాయమూర్తి జస్టిస్ భంభానితో ఈ విచారణ చేపట్టారు. అనంతరం సత్వర ఆదేశాలను జారీ చేశారు. 

ఫలితంగా ఆయనను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ సందర్భంగా బీజేపీకి చెందిన కొందరు నేతలపైనా మురళీధర్ విమర్శలు చేశారు. ఇంత అకస్మాత్తుగా ఆయనను బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కొలీజియం ఇదివరకే ఆయన బదిలీకి సిఫారసు చేయగా దాన్ని కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. 

మురళీధర్‌ బదిలీపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ హైకోర్టులో జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌ను పంజాబ్‌, హర్యానాకు బదిలీ చేస్తున్నట్లు ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది.

ఆయనను బదిలీ చేయాలని 2018 డిసెంబరు, 2019 జనవరిల్లో కేంద్రం చేసిన సిఫారసును అప్పటి సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తిరస్కరించారు. ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ సాగు తున్న దశలో బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది.

click me!