డిల్లీ అల్లర్లు... హెల్ప్ లైన్ నంబర్లు విడుదలచేసిన పోలీసులు

By Arun Kumar PFirst Published Feb 26, 2020, 8:38 PM IST
Highlights

దేశ రాజధాని డిల్లీ అల్లర్లలో అట్టుడుకుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డిల్లీలో మైనారిటీ ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. 

న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఎఎ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పిఆర్ లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని డిల్లీలో అయితే ఈ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నారు. డిల్లీలో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికే 24 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో హింసాత్మక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు డిల్లీ  పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

హింసాత్మక ప్రాంతాల్లోని ప్రజలు పోలీసుల సాయాన్ని పొందేందుకు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటుచేశారు. ఎలాంటి సాయం కావాలన్నా ఆ నంబర్లకు ఫోన్ చేయాలని డిల్లీ వాసులకు పోలీసులు సూచించారు.  

హెల్ప్ లైన్ నంబర్లు:
011- 22829334
011-22829335   

డిల్లీ పోలీస్ విభాగానికి చెందిన అధికారి ఎంఎస్ రంధావా మాట్లాడుతూ... ఇప్పటివరకు డిల్లీలో జరుగుతున్న అల్లర్లపై 18ఎఫ్ఐఆర్ లు  నమోదయినట్లు తెలిపారు. మొత్తం 106 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే నార్త్ ఈస్ట్ డిల్లీలోని సిసిటివి  పుటేజితో పాటు ఇతర మార్గాల ద్వారా హింసాత్మక ఘటనకు పాల్పడేవారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా డిల్లీ పోలీసులు పటిష్ట బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు.  

click me!