Karan Thapar Vs Jai Anant Dehadrai: లైంగిక వేధింపుల ఘటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ ను సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ రక్షించారని సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు కరణ్ థాపర్
Karan Thapar Vs Jai Anant Dehadrai: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వేధింపుల ఘటనపై సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ చేసిన ట్వీట్‌పై కరణ్ థాపర్ విరుచుకుపడ్డారు. గతంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా సభ్యత్వాన్ని పార్లమెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె డబ్బులు తీసుకొని అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు సంచలనం రేపాయి. అలాగే ఆమె తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, ఇతరులకు షేర్ చేసినందకు గాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈమెను పార్లమెంట్ నుంచి వేటు వేసారు.
ఈ విషయంలో లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తన సందేశాన్ని (టెక్స్ మెసేజ్) ఎడిట్ చేసి తప్పుగా చిత్రీకరించారని జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఆరోపించాడు. జై అనంత్ దేహద్రాయ్ చెప్పే విషయంలో కొంచెమైన నిజం ఉంటే.. మొత్తం సందేశాన్ని ఎడిట్ చేయకుండా బహిరంగం చేయాలని కరణ్ థాపర్ సవాల్ విసిరారు.
undefined
ఆ సవాల్ కు జై అనంత్ దేహద్రాయ్ స్పందిస్తూ.. శశి థరూర్‌పై వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా థాపర్ రక్షించారని ఆరోపించారు. 2022లో జరిగిన వేధింపుల ఘటన తర్వాత కాంగ్రెస్ నేత శశి థరూర్‌ను థాపర్ రక్షించారని జై అనంత్ దేహద్రాయ్ తన ట్వీట్‌లో ఆరోపించారు.
ఇందుకు జర్నలిస్టు థాపర్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు. డెహాడ్రాయ్ ఘటనలను పూర్తిగా తప్పుగా చిత్రీకరించారని అన్నారు. నా టెక్స్ట్ మెసేజ్‌లలో ఒకటి ఎడిట్ చేయబడిందనీ, తప్పుగా సూచిస్తున్నారని అన్నారు. శశి థరూర్ పరువు తీసేందుకే జై అనంత్ దేహద్రాయ్ ఇలా చేశారనీ, ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్ పై దేహద్రాయ్ చేసిన ఆరోపణలను దూషణ చర్యగా అభివర్ణించారు.
శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో శశి థరూర్ ని కించపరిచే ప్రయత్నంలో జై దేహద్రాయ్.. అతనిపై ఒక విధమైన ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారనీ, గుర్తు తెలియని అనేక మంది మహిళలతో శశి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ..తనకు పదుల సంఖ్యలో సందేశాలు పంపారని తెలిపారు. మెసేజ్ లను సర్క్యులేట్ చేస్తున్న మహిళను గుర్తించి.. తాను సంప్రదించాననీ, ఆమె చేసిన ఆరోపణలను ఆమెనే నిర్ద్వంద్వంగా ఖండించిందని తెలిపారు. ఈ సమయంలో శశిథరూర్ ను కించపరిచే ఈ ప్రయత్నాన్ని ఆపమని చెప్పడానికి తాను జై దేహద్రాయ్‌ని ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ, తన ఫోన్ లిస్ట్ చేయలేదనీ, ఆ తరువాత తాను చెప్పాలనుకున్న దాన్ని టెక్స్ మెసేజ్ రూపంలో పంపినట్టు తెలిపారు.
కానీ, జై దేహద్రాయ్ మాత్రం తాను పంపిన టెక్స్ట్ మెసేజ్ ను పూర్తి అర్థం చేసుకోలేదని అన్నారు. తన ఉద్దేశ్యం సరళమైనదనీ, తాను చెప్పాలన్నది స్పష్టంగా వివరించానని అన్నారు. తాను శశిథరూర్ ని కాపాడుతున్నాననే వాదనలో అర్ధం లేనిదనీ, ఎందుకంటే అతనికి రక్షణ అవసరం లేదన్నారు. కానీ, ఆ సమయంలో తాను గుర్తించిన అమ్మాయిని పేరు మార్చి రక్షించానని అన్నారు. నిజంగా జై దేహద్రాయ్ గౌరవనీయమైన వ్యక్తి అయితే.. తాను పంపిన మెసేజ్ లను ఇతర సందేశాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రస్తవన ఎందుకు ముందుకు వచ్చిందో తాను కూడా ఆశ్చర్యపోతున్నానని సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ అన్నారు.