ఆమె అంగీకారంతోనే అన్న అక్బర్.. తిప్పికొట్టిన పల్లవి గొగొయ్

Published : Nov 03, 2018, 11:10 AM IST
ఆమె అంగీకారంతోనే అన్న అక్బర్.. తిప్పికొట్టిన పల్లవి గొగొయ్

సారాంశం

ఆమెతో సంబంధం ఉన్నమాట వాస్తవేమనని అంగీకరించాడు. అయితే.. పల్లవి గొగొయ్ అంగీకారంతోనే తనతో బంధాన్ని కొనసాగించానని కూడా చెప్పారు. ఆమెతో సంబంధం కారణంగా తన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయని.. అందుకే ఆ బంధానికి అక్కడితో పులిస్టాప్ పెట్టినట్లు వివరించారు. 

కేంద్ర మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పై వస్తున్న మీటూ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలువురు మహిళా జర్నలిస్టులు మీటూ ఆరోపణలు చేయగా.. తాజాగా అమెరికాలో స్థిరపడిన భారతీయ జర్నలిస్టు.. వాషింగ్టన్ పోస్టులో ఎంజేఅక్బర్ తనను రేప్ చేశాడంటూ ఓ కథనం రాసింది.

అయితే.. ఆ కథనం స్పందించిన ఎంజే అక్బర్.. ఆమెతో సంబంధం ఉన్నమాట వాస్తవేమనని అంగీకరించాడు. అయితే.. పల్లవి గొగొయ్ అంగీకారంతోనే తనతో బంధాన్ని కొనసాగించానని కూడా చెప్పారు. ఆమెతో సంబంధం కారణంగా తన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయని.. అందుకే ఆ బంధానికి అక్కడితో పులిస్టాప్ పెట్టినట్లు వివరించారు. 

ఇప్పటి వరకు ఎంజే అక్బర్ పై చాలా మంది మీటూ ఆరోపణలు చేయగా.. ఎప్పుడూ స్పందించని ఆయన భార్య మల్లిక అక్బర్ కూడా స్పందించడం గమనార్హం. పల్లవితో తన భర్త సంబంధం.. వారిద్దరి ఏకాభిప్రాయంతో కొనసాగిందని చెప్పుకొచ్చారు.

అయితే.. ఈ వ్యాఖ్యలపై పల్లవి గొగొయ్ మరోసారి స్పందించారు. అక్బర్ చేబుతున్న మాటలు వాస్తవాలు కాదని తేల్చి చెప్పారు. వరసగా లైంగిక దాడి చేసి.. అది ఏకాభిప్రాయంతోనే జరిగింది అనడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. తనపై అక్బర్ లైంగిక దాడి చేశాడని.. అది కచ్చితంగా ఏకాభిప్రాయంతో జరిగింది కాదని ఆమె మరోసారి చెప్పుకొచ్చారు.

వాషింగ్టన్ పోస్టులో తాను రాసిన కథనానికి తాను ఇప్పటికే కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఆ కథనంలో రాసింది అక్షరాల నిజమని చెప్పారు. తనలా లైంగిక దాడి ఎదుర్కొన్న మరికొందరు యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి వారికి ఎదురైన సంఘటనలు బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని తాను మీడియా ముందుకు తీసుకువచ్చానని పల్లవి తెలిపారు.

read more news

నా ఒంటిమీద డ్రస్ తేసేసి రేప్ చేశాడు... ఎంజే అక్బర్ పై మరో జర్నలిస్ట్

పల్లవి వల్లే మా కుటుంబంలో అశాంతి: ఎంజె అక్బర్ భార్య

మీటూ ఎఫెక్ట్...ఆ ఎన్నారై జర్నలిస్టుతో సంబంధం ఉంది...కానీ...: ఎంజే. అక్బర్

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?