ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు విద్యార్థి

Published : Sep 17, 2018, 08:01 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు విద్యార్థి

సారాంశం

ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచి.. రాజకీయాలను మలుపు తిప్పిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడిగా తెలుగు విద్యార్థి ఎన్నికయ్యాడు.

ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచి.. రాజకీయాలను మలుపు తిప్పిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడిగా తెలుగు విద్యార్థి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమికి (యూనైటైడ్ లెఫ్ట్) విజయకేతనం ఎగురవేసింది.

ఈ కూటమికి చెందిన హైదరాబాద్ ఏఐఎస్ఎఫ్ నాయకుడు, రీసెర్చ్ స్కాలర్ ఎన్.సాయిబాలాజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీనితో పాటు 4 కేంద్ర ప్యానెళ్లను సొంతం చేసుకుంది. యూనైటైడ్ లెఫ్ట్‌కు ఏబీవీపీ గట్టి పోటీనిచ్చింది. ఉపాధ్యక్షుడిగా సారిక చౌదరి (డీఎస్ఎఫ్), ప్రధాన కార్యదర్శిగా ఎజాజ్ అహ్మద్ రాథర్ (ఎస్ఎఫ్ఐ), సంయుక్త కార్యదర్శిగా అముత జయదీప్ (ఏఐఎస్ఎఫ్) ఎన్నికయ్యారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే