ఇస్రో మరో వాణిజ్య విజయం.. కక్ష్యలోకి రెండు విదేశీ ఉపగ్రహాలు

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 7:34 AM IST
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలోకి మరో వాణిజ్య విజయం వచ్చి చేరింది. పీఎస్ఎల్వీ-సీ42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలోకి మరో వాణిజ్య విజయం వచ్చి చేరింది. పీఎస్ఎల్వీ-సీ42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు అత్యంత నమ్మకమైన వాహకనౌక పీఎస్ఎల్‌వీ-సీ42 ద్వారా బ్రిటన్ నిర్మించిన నోవాసర్, ఎస్1-4లను అంతరిక్షంలోకి చేరవేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ42 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 17 నిమిషాల 45 సెకన్లలో ప్రయోగం పూర్తయ్యింది. ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఇస్రో ఛైర్మన్ శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్‌వీ వినియోగదారులకు అనుకూల వాహక నౌకగా పేరొందిందని చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో 18 ప్రయోగాలు చేపట్టనున్నట్లు శివన్ తెలిపారు. 

click me!