జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం : 12 మంది దుర్మరణం.. భారీగా క్షతగాత్రులు, పలువురి పరిస్థితి విషమం

Siva Kodati |  
Published : Feb 28, 2024, 08:40 PM ISTUpdated : Feb 28, 2024, 08:44 PM IST
జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం : 12 మంది దుర్మరణం.. భారీగా క్షతగాత్రులు, పలువురి పరిస్థితి విషమం

సారాంశం

బుధవారం జార్ఖండ్‌లోని జమ్తారా - కర్మతాండ్‌ మార్గంలోని కల్జారియా సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో చిమ్మ చీకట్లు నెలకొనడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్ధితి విషమంగా వుండటంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

బుధవారం జార్ఖండ్‌లోని జమ్తారా - కర్మతాండ్‌ మార్గంలోని కల్జారియా సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కథనాలను బట్టి చూస్తే కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికార వర్గాల నుంచి ఎలాంటి ధృవీకరణ అందలేదు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, రెవెన్యూ , అగ్నిమాపక, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో చిమ్మ చీకట్లు నెలకొనడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్ధితి విషమంగా వుండటంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్