మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ)లోని సెక్షన్ 50 కింద సమన్లు పొందిన వ్యక్తి మనీలాండరింగ్ విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని , ప్రతిస్పందించాలని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ)లోని సెక్షన్ 50 కింద సమన్లు పొందిన వ్యక్తి మనీలాండరింగ్ విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని , ప్రతిస్పందించాలని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పిఎంఎల్‌ఎ కింద విచారణకు అనుగుణంగా అవసరమైతే ఈడి పిలిస్తే సమన్లు పొందిన వ్యక్తి తప్పనిసరిగా హాజరుకావాలని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
"చట్టం ప్రకారం విచారణ సమయంలో సాక్ష్యాలను సమర్పించడానికి లేదా హాజరు కావడానికి అవసరమైన ఏ వ్యక్తినైనా ఈడీ పిలిపించవచ్చు . సమన్లు జారీ చేసిన వారు ఈడీ ద్వారా పేర్కొన్న నోటీసులను గౌరవించడం , ప్రతిస్పందించడం అవసరం" అని కోర్టు పేర్కొంది. ఫెడరల్ ఏజెన్సీని కొన్నింటిని ప్రశ్నించకుండా నిరోధించే తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాన్ని తోసిపుచ్చింది.
undefined
తమిళనాడులోని ఐదు జిల్లాల కలెక్టర్ల వ్యక్తిగత హాజరును కోరకుండా మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. సమన్లను గౌరవించడం, ప్రతిస్పందించడం అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది . కలెక్టర్లు ఏజెన్సీ పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరుకావాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. పీఎంఎల్ఏలోని సెక్షన్ 50కింద తనకు అందించిన అధికారులను వినియోగించుకుంటూ ఈడీ ద్వారా ఇంప్యుగ్డ్ సమన్లు జారీ చేయబడ్డాయి.
ED can summon any person; those summoned expected to respect and respond: Supreme Court
report by https://t.co/KfBrRKYOIt
చట్ట బేర్ రీడింగ్ నుంచి.. చట్ట ప్రకారం విచారణ సమయంలో వారి హాజరు అవసరమని భావిస్తే , సంబంధిత అధికారి ఎవరినైనా పిలిపించే అధికారం వుందని స్పష్టంగా తెలియజేసింది. జిల్లా కలెక్టర్లు, సమన్లు జారీ చేయబడిన వ్యక్తులు ఈ సమన్లను గౌరవించడం, వాటికి ప్రతిస్పందించడం తప్పనిసరి అని న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ వంటి ఫెడరల్ ఏజెన్సీల సాయంతో రాజకీయ ప్రత్యర్ధులను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీ కాకుండా ఇతర రాజకీయ పార్టీల ఏలుబడిలో వున్న రాష్ట్రాలు ఆరోపిస్తున్న తరుణంలో కోర్టు ఆదేశం వచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ఈడీ ఏడవసారి దాఖలు చేసిన సమన్లను సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి దాటవేశారు . తమ సమన్లను ధిక్కరించినందుకు గాను కేజ్రీవాల్‌పై ఈడీ ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసు విచారణ జరిగే మార్చి 16 వరకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా కేజ్రీవాల్‌కు కోర్టు మినహాయింపు ఇచ్చింది.
కాగా.. అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి తమిళనాడులోని ఐదు జిల్లాల కలెక్టర్లకు జారీ చేసిన సమన్లను నిలిపివేస్తూ 2023 నవంబర్‌లో జారీ చేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. ఈడీ తన అధికారులకు సమన్లు పంపడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను పూర్తిగా తప్పుగా భావించింది.