
రాంచీ:మావోయిస్టు పార్టీ నేతలు అత్యంత విలాసవంతమైన వాహనాలను ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసిన మావోయిస్టుల నుండి పోలీసులు బీఎండబ్ల్యుూ, థార్ వంటి అత్యంత ఆధునాతమైన వాహనాలను పోలీసులుసీజ్ చేశారు.
Jharkhand లోని ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎల్ఎఫ్ఐ కి చెందిన ముగ్గురు maoistలను అరెస్ట్ చేసినట్టుగా ranchi sp సురేంద్రకుమార్ ఝా చెప్పారు.
అరెస్టైన వారిలో అమీర్‌చంద్ కుమార్, ఆర్యకుమార్ సింగ్, ఉజ్వల్ కుమార్ సహాులుగా గుర్తించారు. లగ్జరీకార్ల విలువైన చ రూ. 3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ప్రముఖులను బెదిరించి వసూలు చేసిన సొమ్ముతో ఈ వాహనాలను కొనుగోలు చేశారని పోలీసులు చెప్పారు.
గతంలో కూడా మావోయిస్టుల నుండి అత్యంత ఆదునాతమైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు ఉపయోగించే అత్యంత ఆధునాతమైన ఆయుధాలను కూడా మావోయిస్టులు ఉపయోగించిన ఉదంతాలను పోలీసులు గతంలో గుర్తించారు.
నగర ప్రాంతాల్లో తమ ఉనికిని గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను మావోయిస్టులు సాధారణ పౌరులుగా గడుపుతుంటారు. కాలేజీల్లో పనిచేసేవారి మాదిరిగానో, ఏదైనా వ్యాపారం చేసే వారిగానో పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తూ గతంలో పలువురు అరెస్టయ్యారు.
అడవుల్లో ఉన్న దళాలకు అవసరమైన మందులతో పాటు ఇతర అవసరాలను తీర్చేందుకు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారంతా తమ ఉనికిని గుర్తించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకొంటున్నారని కూడా పోలీసులు గుర్తించారు.ర్ఖండ్ లో పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్టులు కూడా ఇదే కోవలో లగ్జరీ వాహనాలను ఉపయోగించారా అనే చర్చ కూడా లేకపోలేదు.
మావోయిస్టు పార్టీ నేతలు తమ ఉనినికి బయట పడకుండా ఉండేందుకు అనేక ఎత్తుగడలతో ముందుకు వెళ్తారని కూడా పోలీసులు చెబుతున్నారు. అర్బన్ ప్రాంతంలో పోలీసులు, నిఘా వర్గాలు తమ ఉనికిని పసిగట్టకుండా ఉండేందుకు గాను మావోలు ఈ తరహా లగ్జరీ వాహానాలు ఉపయోగించడాన్ని ప్రారంభించవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు కాంట్రాక్టర్లు, ప్రముఖుల నుండి వసూలు చేసిన డబ్బులతో లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసి ఉపయోగించుకొంటున్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.