ధన్‌బాద్ జడ్జి మృతిపై జార్ఖండ్ చీఫ్‌జస్టిస్‌కి సీజేఐ ఫోన్: పోలీసులకు హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Jul 29, 2021, 2:20 PM IST
Highlights


ధన్‌బాద్ అడిషనల్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ అనుమానాస్పద మృతిపై హైకోర్టు గురువారం నాడు విచారణ ప్రారంభించింది.  జిల్లా పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ జార్ఖండ్ చీఫ్ జస్టిస్ తో ఈ విషయమై ఫోన్ లో మాట్లాడారు.
 

ధన్‌బాద్: ధన్‌బాద్ అడిషనల్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ అనుమానాస్పద మృతిపై జిల్లా పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై హైకోర్టు విచారణ చేస్తోంది.బుధవారం నాడు మార్నింగ్ వాక్ కు వెళ్లిన  ఉత్తమ్ ఆనంద్ ను అనుమానాస్పద స్థితిలో తన ఇంటికి సమీపంలోనే మరణించాడు. మార్నింగ్ వాక్ చేస్తున్న జడ్జిని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ వాహనం ఉద్దేశ్యపూర్వకంగానే జడ్జిని ఢీకొట్టినట్టుగా సీసీటీవీదృశ్యాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

also read:జార్ఖండ్‌లో జడ్జి అనుమానాస్పద మృతి: సుప్రీంకోర్టులో ప్రస్తావన, పోలీసుల దర్యాప్తు

ఈ విషయమై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ  జార్ఖండ్ హైకోర్టు  చీఫ్ జస్టిస్ తో ఫోన్‌లో మాట్లాడారు.  ధన్ బాద్ జిల్లా అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేస్తోంది. ధన్‌బాద్ జిల్లా పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.పలు మాఫియా కేసులను జడ్జి విచారణ చేస్తున్నారు.అయితే  జడ్జి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 
 

click me!