జార్ఖండ్ గ్యాంగ్‌రేప్..విచారణలో చేదు నిజాలు.. మహిళలపై అత్యాచారంతో పాటుగా...

First Published Jun 24, 2018, 10:44 AM IST
Highlights

జార్ఖండ్ గ్యాంగ్‌రేప్..విచారణలో చేదు నిజాలు.. మహిళలపై అత్యాచారంతో పాటుగా...

మనుషుల అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన స్వచ్ఛంధ సంస్థకు చెందిన ఐదుగురు మహిళలు సామూహిక అత్యాచారానికి పాల్పడటం  దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. విచారణలో వారు చెప్పిన మాటలు విని పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు..

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘ఆశాకిరణ్ ’ అనే స్వచ్ఛంధ సంస్థ కోచాంగ్ ప్రాంతలో అవగాహన కల్పించాలని భావించింది. దీనిలో భాగంగా సదరు ఎన్జీవోకు చెందిన 11 మంది సభ్యుల బృందం ఓ పాఠశాల వద్ద ప్రదర్శణ ఇస్తుండగా కొందరు దుండగులు మారణాయుధాలతో అక్కడికి వచ్చారు.. స్వచ్ఛంధ సంస్థ తరపున ఉన్న పురుషులను  కొట్టి.. మిగిలిన ఐదుగురు మహిళలను కారులోకి ఎక్కించుకుని అపహరించుకుపోయారు.

అనంతరం వారిని రాంచీకి 100 కిలోమీటర్ల దూరంలోని కుంతీ జిల్లా అడవుల్లోకి తీసుకెళ్లి.. వారిపై సుమారు మూడు గంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అక్కడితో ఆగకుండా తుపాకీని గురిపెట్టి.. కర్రలతో కొడుతూ.. మహిళల నోట్లో మూత్రం పోశారు. అలా నాలుగు గంటలపాటు నరకం చూపించి.. పైశాచిక ఆనందాన్ని పొందారు.. అత్యాచారాన్ని వీడియో తీశారు.. విషయం బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. మిగిలిన నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

click me!