130 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు.. ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో ఇద్దరు మృతి.. అసలేం జరిగిందంటే..

By Sumanth Kanukula  |  First Published Nov 12, 2023, 10:32 AM IST

వేగంగా వెళ్తున్న ఒక రైలును ఆపేందుకు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో ఆకస్మికంగా భారీ కుదుపు చోటుచేసుకుంది. దీంతో ఆ రైలులోని ఇద్దరు ప్రయాణికులు మరణించారు.


వేగంగా వెళ్తున్న ఒక రైలును ఆపేందుకు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో ఆకస్మికంగా భారీ కుదుపు చోటుచేసుకుంది. దీంతో ఆ రైలులోని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో ఓవర్‌హెడ్ విద్యుత్ వైర్ పడిపోవడంతో రైలును ఆపేందుకు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడంతో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో కుదుపుల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని ధన్‌బాద్ రైల్వే అధికారులు తెలిపారు. 

మధ్యాహ్నం 12.05 గంటలకు గోమోహ్, కోడెర్మా రైల్వే స్టేషన్‌ల మధ్య పర్సాబాద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తోందని తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత.. ధన్‌బాద్ రైల్వే డివిజన్‌లోని గ్రాండ్ కార్డ్ లైన్‌లో కోడెర్మా-గోమో సెక్షన్‌లో నాలుగు గంటలకు పైగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రైలు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ను డీజిల్ ఇంజన్ ద్వారా గోమోకు తీసుకువచ్చి ఎలక్ట్రిక్ ఇంజన్ ద్వారా ఢిల్లీకి పంపినట్లు తెలిపారు.

Latest Videos

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ధన్‌బాద్‌ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ కేకే సిన్హా, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

click me!