జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు, ఓ జవాన్ మృతి

Published : Jun 02, 2019, 11:52 AM IST
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు, ఓ జవాన్ మృతి

సారాంశం

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు

రాంచీ:  జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆదివారం నాడు ఉదయం జార్ఖండ్ రాష్ట్రంలోని  ఢంకాలో మావోలు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది.రెండు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి  చెందాడు. 

నలుగురు మావోయిస్టులు చనిపోయారు.  ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో భద్రతా బలగాలు కూంబింగ్‌ను పెద్ద ఎత్తున చేపట్టాయి.

PREV
click me!

Recommended Stories

New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది
టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట