ఉగ్రవాద మూలాల వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని కిషన్ రెడ్డి

By telugu teamFirst Published Jun 1, 2019, 5:45 PM IST
Highlights

తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదులకు మతం లేదని, తమ బిజెపి అభిప్రాయం కూడా ఇదేనని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ముస్లింలను తాను ఉగ్రవాదులుగా ఎప్పుడూ పేర్కొనలేదని ఆయన స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీ: ఉగ్రవాద మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. 

తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యలాపాలు పెరుగుతున్న విషయాన్నే తాను చెప్పానని శనివారం ఆయన మీడియాతో అన్నారు. 

తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదులకు మతం లేదని, తమ బిజెపి అభిప్రాయం కూడా ఇదేనని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ముస్లింలను తాను ఉగ్రవాదులుగా ఎప్పుడూ పేర్కొనలేదని ఆయన స్పష్టం చేశారు. 

దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని చెప్పారు.

click me!