Naresh Goyal: రూ.538 కోట్లు ఎగ్గొట్టిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో ఒక రోజు విచారణ అనంతరం అరెస్టు చేసింది. ఆయనను శనివారం బాంబే పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఏడాది మే నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది.
Jet Airways Founder Naresh Goyal: రూ.538 కోట్లు ఎగ్గొట్టిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో ఒక రోజు విచారణ అనంతరం అరెస్టు చేసింది. ఆయనను రేపు బాంబే పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఏడాది మే నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది.
వివరాల్లోకెళ్తే.. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిందని ఎన్డీటీవీ నివేదించింది. ముంబయిలోని ఈడీ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద గోయల్ ను అదుపులోకి తీసుకున్నారు. 74 ఏళ్ల గోయల్ ను శనివారం ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్ ఏ కోర్టులో హాజరుపరచనున్నారు.
కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించి జెట్ ఎయిర్‌వేస్, గోయల్, ఆయన భార్య అనిత, కొందరు మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్ (జెఐఎల్) కు రూ .848.86 కోట్ల రుణ పరిమితులు, ణాలను మంజూరు చేసిందని, ఇందులో రూ .538.62 కోట్లు బకాయి ఉన్నాయని ఆరోపిస్తూ బ్యాంక్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఖాతాను 2021 జూలైలో 'మోసం'గా సీబీఐ ప్రకటించింది. మొత్తం కమీషన్ ఖర్చుల్లో సంబంధిత కంపెనీలకు రూ.1,410.41 కోట్లు చెల్లించినట్లు జేఐఎల్ ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలిందని, తద్వారా జేఐఎల్ నుంచి నిధులను పక్కదారి పట్టించారని బ్యాంక్ ఆరోపించింది.
గోయల్ కుటుంబానికి చెందిన సిబ్బంది జీతాలు, ఫోన్ బిల్లులు, వాహన ఖర్చులు వంటి వ్యక్తిగత ఖర్చులను జేఐఎల్ చెల్లించిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జెట్ లైట్ (ఇండియా) లిమిటెడ్ (జేఎల్ఎల్) ద్వారా అడ్వాన్స్ తీసుకుని పెట్టుబడులు పెట్టి నిధులు మళ్లించారని ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. అనుబంధ సంస్థ జేఎల్ఎల్ కు రుణాలు, అడ్వాన్సులు, పెట్టుబడుల రూపంలో నిధులను జేఐఎల్ మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.