Ambad Tehsil: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో డజన్ల కొద్దీ మంది తీవ్రంగా గాయపడ్డారు. అంబాద్ తహసీల్‌లోని అంతర్వాలి సారథి గ్రామంలో హింసాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు బాష్పవాయువు షెల్‌లు ప్రయోగించారు. పోలీసులు గాలిలోకి కొన్ని రౌండ్లు కాల్పులు సైతం జరిపారని గ్రామస్తులు పేర్కొన్నారు.
Maratha reservation protest: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో డజన్ల కొద్దీ మంది తీవ్రంగా గాయపడ్డారు. అంబాద్ తహసీల్‌లోని అంతర్వాలి సారథి గ్రామంలో హింసాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు బాష్పవాయువు షెల్‌లు ప్రయోగించారు. పోలీసులు గాలిలోకి కొన్ని రౌండ్లు కాల్పులు సైతం జరిపారని గ్రామస్తులు పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. మధ్య మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మరాఠా రిజర్వేషన్ల కోసం చేపట్టిన నిరసన శుక్రవారం హింసాత్మకంగా మారడంతో పోలీసులు సహా డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. అంబాడ్ తాలూకాలోని ధూలే-షోలాపూర్ రోడ్డులోని అంతర్వాలీ సారథి గ్రామంలో హింసాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జితో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పోలీసులు గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారని గ్రామస్తులు పేర్కొన్నా అధికారులు ధృవీకరించలేదు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరంగే నేతృత్వంలో ఆందోళనకారులు మంగళవారం నుంచి గ్రామంలో నిరాహార దీక్ష చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శాంతి కోసం విజ్ఞప్తి చేయడంతో పాటు హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజకీయంగా బలంగా ఉన్న మరాఠా సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర రవాణా బస్సులు, ప్రైవేటు వాహనాలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు శుక్రవారం ఆందోళన హింసాత్మకంగా మారిందని పోలీసులు తెలిపారు. అంతర్వాలీ సారథి వద్ద జరిగిన రాళ్లదాడిలో 20 మంది నిరసనకారులతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సచిన్ సంగ్లే సహా 18 మంది పోలీసులు, అధికారులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి.
STORY | Maratha quota agitation turns violent in Jalna district of Maharashtra, CM appeals for peace
READ: https://t.co/oU9r5Whu5F
VIDEO: pic.twitter.com/ve5Zpwvajn
నిరాహార దీక్ష విరమించాలని ముఖ్యమంత్రి బుధవారం ఆందోళనకారులతో మాట్లాడారనీ, అయితే వారు వెనక్కి తగ్గలేదని అధికారులు తెలిపారు. గురువారం, అంబాడ్ తహసీల్ లోని వాడిగోద్రి గ్రామంలో దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేయబడ్డాయి, వారం ప్రారంభంలో షాగఢ్ లో భారీ నిరసన సభ జరిగింది. జల్నాకు అదనపు పోలీసు బలగాలను పంపినట్లు అధికారులు తెలిపారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఎవరూ హింసకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి షిండే ఒక ప్రాంతీయ న్యూస్ ఛానెల్ తో అన్నారు. "మరఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించిందని, కానీ సుప్రీంకోర్టు దానిని రద్దు చేసిందని" తెలిపారు.
"దాన్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు కాబట్టే రాజకీయాల్లోకి వెళ్లదలుచుకోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటోంది. ఏవైనా సూచనలు ఉంటే స్వాగతిస్తాం. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా శాంతిని పాటించాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు" పేర్కొన్నారు. హింసాకాండపై ఉన్నత స్థాయి విచారణకు కమిటీ వేస్తామని షిండే ప్రకటించారు. మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. అంతర్వాలీ సారథి గ్రామంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఆమోదయోగ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడానికి శివసేన-బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చవాన్ డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) నాయకుడు అంబాదాస్ దన్వే కూడా పోలీసులు బలప్రయోగాన్ని ఖండించారు.