జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?

By Asianet NewsFirst Published Apr 29, 2023, 7:41 AM IST
Highlights

జేఈఈ మెయిన్ 2023 సెషన్ -2 ఫలితాలను శనివారం ఉదయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జూన్ 4వ తేదీన జరగనుంది. 

విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ 2023 సెషన్ - 2 రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ద్వారానే విద్యార్థులు దేశంలోని అనేక గొప్ప ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. మెయిన్ పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. అయితే తాజాగా ఎన్ టీఏ ఈ ఫలితాలను విడుదల చేసింది. 

ఈద్ రోజు మసీదుల వెలుపల నమాజ్ చేశారని 2 వేల మందిపై కేసులు.. యూపీలోని అలీగఢ్ పోలీసుల అభియోగాలు

ఈ సంవత్సరం దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్ష 2023కి హాజరయ్యారు. ఏప్రిల్ 15వ తేదీన ముగిసిన ఈ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక సమాధానాల కీ ఏప్రిల్ 19న  ఎన్ టీఏ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 21వ తేదీ వరకు గడువు విధించింది. ఏప్రిల్ 24వ తేదీన ఫైనల్ కీ విడుదల చేసింది. శనివారం ఉదయం తుది ఫలితాలను విడుదల చేసింది. 

స్కూటీపై ఎదురుగా గర్ల్‌ఫ్రెండ్‌.. రొమాన్స్ చేస్తూ రోడ్లపై చక్కర్లు.. ఆ వ్యక్తితో పోలీసులు ఏం చేయించారంటే?

ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత పొందుతారు. ఆ పరీక్ష కోసం 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని ఎన్ టీఏ ప్రకటించింది. జూన్ 4వ తేదీన జరిగే ఈ పరీక్ష కోసం మే 29వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 18వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. 

కాగా.. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్ 2023 సెషన్ - 2 రిజల్ట్స్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ వెబ్ సైట్ లో విద్యార్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన రోజు వివరాలు అలాగే సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. 

ఈ లింక్ ను క్లిక్ చేసి విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..

 

click me!