రైల్వే బోర్డ్ ఛైర్మన్‌గా జయావర్మ సిన్హా.. తొలిసారిగా మహిళకు ఛాన్స్

By Siva Kodati  |  First Published Aug 31, 2023, 5:08 PM IST

భారత రైల్వే బోర్డుకు నాయకత్వం వహించే అవకాశం తొలిసారిగా మహిళకు దక్కింది. రైల్వే బోర్డ్ కొత్త ఛైర్మన్‌, సీఈవోగా జయా వర్మ సిన్హా నియమితులయ్యారు. జయా వర్మ ఈ పదవిలో వచ్చే ఏడాది ఆగస్ట్ 31 వరకు ఈ పదవిలో కొనసాగనుంది. 


ప్రపంచంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే బోర్డుకు నాయకత్వం వహించే అవకాశం తొలిసారిగా మహిళకు దక్కింది. రైల్వే బోర్డ్ కొత్త ఛైర్మన్‌, సీఈవోగా జయా వర్మ సిన్హా నియమితులయ్యారు. ఇప్పటి వరకు అనిల్ కుమార్ లహోటీ రైల్వే బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. జయా వర్మ ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే రైల్వే బోర్డులో కార్యకలాపాలు, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం మెంబర్‌గా వున్నారు. ఈ క్రమంలో జయా వర్మను రైల్వే బోర్డు కొత్త చీఫ్‌గా నియమిస్తున్నట్లుగా రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. జయా వర్మ ఈ పదవిలో వచ్చే ఏడాది ఆగస్ట్ 31 వరకు ఈ పదవిలో కొనసాగనుంది. 

అలహాబాద్ యూనివర్సిటీలో చదువుకున జయా వర్మ.. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్‌లలో ఆయా హోదాల్లో జయా వర్మ విధులు నిర్వర్తించారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమీషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 1న ఆమె పదవి విరమణ చేయనున్నారు. ఇలాంటి దశలో జయావర్మకు రైల్వే బోర్డ్ ఛైర్మన్ పదవి దక్కడం విశేషం. 

Latest Videos

click me!