మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: బీజేపీపై జయా బచ్చన్ ఫైర్

By narsimha lode  |  First Published Dec 20, 2021, 5:45 PM IST

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్  రాజ్యసబలో సోమవారం నాడు ఫైర్ అయ్యారు. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలపై ఆమె విరుచుకు పడ్డారు.


న్యూఢిల్లీ: మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని   బీజేపీ ఎంపీలను ఉద్దేశించి రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొందరు సభ్యులు తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు.రాజ్యసభలో ట్రెజరీ బెంచ్‌ల్లో కూర్చున్న బీజేపీ ఎంపీలతో ఎస్పీ ఎంపీ Jaya Bachchan తీవ్ర వాగ్వాదానికి దిగారు., దీంతో Rajya sabha లో ఒక్కసారిగా వాతావరణం వేడేక్కింది. సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సాయంత్రం ఐదు గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు. జయా బచ్చన్ మాట్లాడేందుకు సభలో నిలబడిన సమయంలో  గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. దీంతో జయాబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనను మాట్లాడనివ్వకుంటే మీరే సభను నడపాలని ఆమె అన్నారు. 

also read:పనామా పేపర్ లీక్: ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్యరాయ్

Latest Videos

undefined

నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్స్  సవరణ బిల్లు 2021 పై జరుగుతున్న చర్చలో పాల్గొనే సమయంలో జయా బచ్చన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాన్ని ప్రారంభించిన జయా బచ్చన్ విపక్షాల మాట విననందుకు  ఛైర్మెన్ స్థానాన్ని తాము ఇలా ఆశించగలమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన తప్పును సరిదిద్దడానికి తీసుకొచ్చిన బిల్లుపై తాము చాలా విషయాలు చర్చిస్తున్నామన్నారు.మీరు దయచేసి మమ్మల్ని గొంతు పిసికి చంపండి అంటూ ఆమె చేతులు జోడించింది..

మీరు న్యాయంగా ఉండాలి, ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని కోరారు.  బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా బచ్చన్ ను చూపిస్తూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు జయా బచ్చన్. తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె రాజ్యసభ సభాపతిని కోరారు. అయితే ఈ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న  భువనేశ్వర్ కలిత ప్రకటించారు పనామా పేపర్స్ లీకేజీ ఘటనకు సంబంధించిన కేసులో ఈడీ విచారణకు జయా బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ హాజరైన రోజునే రాజ్యసభలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. 


 

click me!