దేశ తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ కారు డ్రైవర్ మోనప్ప గౌడ్ కన్నుమూత..

Published : Oct 07, 2022, 08:58 AM IST
దేశ తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ కారు డ్రైవర్ మోనప్ప గౌడ్ కన్నుమూత..

సారాంశం

స్వాతంత్ర్య భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు కారు డ్రైవర్ గా పనిచేసిన మోనప్ప గౌడ తన 102వ ఏట కన్నుమూశారు. 

బెంగళూరు :  దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారు డ్రైవర్గా పనిచేసిన మోనప్ప గౌడ కోరంబడ్క (102) బుధవారం కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా కనకమజలు గ్రామంలోని ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.  వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మోనప్ప గౌడ, ఇటీవల కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆయన, ఢిల్లీలో గడిపారు. ఆ సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ డ్రైవర్గా పని చేశారు. 

ఆయనకు కుమారుడు వెంకటరమణ, ముగ్గురు కుమార్తెలు కమల, విమల, కుసుమ ఉన్నారు. స్వాతంత్ర్య సమరంలో నెహ్రూకు సాయం చేసిన ఆయన ఆ తరువాత నెహ్రూ కారు డ్రైవర్ గానూ పనిచేశారు. అలాగే, నవలా రచయిత శివరామ్ కరంత్, మాజీ ఎంపీ శ్రీనివాస్ మాల్యా, మాజీ ముఖ్యమంత్రి కెంగల్ హనుమంతయ్య వద్ద కూడా కారు డ్రైవర్ గా పనిచేశారు. తాజ్ హోటల్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నప్పుడు మంగళూరు విమానాశ్రయం నుంచి నెహ్రూను పికప్ చేసుకుని వచ్చారు. ఆయన డ్రైవింగ్ నైపుణ్యానికి ముగ్దుడైన నెహ్రూ తన కారు డ్రైవర్ గా ఆయనను నియమించుకున్నారని చెబుతారు. 

"మీరు తిట్టినంతంగా నన్ను మా భార్య‌ కూడా తిట్టదు".. లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రీవాల్ సెటైర్

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
Most Expensive Things: ఇండియన్స్ సృష్టించిన అత్యంత ఖరీదైన అద్భుతాలు ఏంటో తెలుసా?