భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Published : Mar 20, 2023, 11:19 AM IST
భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

సారాంశం

భారత పర్యటన కోసం జపాన్ ప్రధాని కిషిడా సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ తరుఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని పర్యటన సుమారు 27 గంటల పాటు కొనసాగనుంది.

రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించడానికి జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా సోమవారం ఉదయం భారత్ కు చేరుకున్నారు. దేశ రాజధానికి చేరుకున్న కిషిడాకు ప్రధాని నరేంద్ర మోడీ తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘జపాన్ ప్రధానికి స్వాగతం పలకడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని మంత్రి ట్వీట్ చేశారు. 

ద్వైపాక్షిక రంగంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం సహా పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని దృష్టి సారించే అవకాశం ఉంది. జీ-20లో భారత్ అధ్యక్ష పదవి, జీ7లో జపాన్ అధ్యక్ష పదవి ప్రాధాన్యతలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.  

లొంగిపోయిన అమృత్ పాల్ సింగ్ మామ, డ్రైవర్.. ఖలిస్థాన్ అనుకూల నాయకుడి కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

పెరుగుతున్న చైనా సైనిక దృఢత్వం నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు కూడా మోడీ, కిషిడా మధ్య విస్తృత చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జపాన్ ప్రధాని పర్యటన సుమారు 27 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం ప్రముఖ థింక్ ట్యాంక్ లో జరిగే ఉపన్యాసంలో ఆయన తన 'ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ ప్లాన్ ఫర్ పీస్ 'ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాముఖ్యతను ఈ ప్రణాళిక హైలైట్ చేస్తుందని భావిస్తున్నారు.

వచ్చే ఐదేళ్లలో భారత్ ఐదు ట్రిలియన్ యెన్లు (రూ.3,20,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గత ఏడాది మార్చిలో భారత్ లో పర్యటించిన సందర్భంగా కిషిడా ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు చారిత్రాత్మక మలుపులో ఉందని, ఆహార భద్రత, వాతావరణం, ఇంధనం, న్యాయమైన, పారదర్శక అభివృద్ధిని ప్రధాన సవాళ్లుగా గుర్తించిందని కిషిడా ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

ఢిల్లీలో షాకింగ్.. యువతిని తిడుతూ, బలవంతంగా క్యాబ్ లోకి లాక్కెళ్లి.. వీడియో వైరల్....

ఈ ఏడాది వరుసగా జీ7, జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను జపాన్, భారత్ లు స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి సవాళ్లను అధిగమించడంలో జీ7, జీ20 దేశాలు పోషించాల్సిన పాత్రలపై ప్రధాని మోడీతో నిర్మొహమాటంగా చర్చలు జరిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అందులో ఆయన తెలిపారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, చట్టబద్ధ పాలన వంటి భాగస్వామ్య విలువలు, సూత్రాలపై ఆధారపడిన రెండు దేశాల మధ్య బహుళ అంచెల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ అవకాశాన్ని పయోగించుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. జపాన్-భారత్ సంబంధాలు వివిధ రంగాల్లో పురోగమించాయని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భారత్ తో సహకారాన్ని మరింత పెంచుకోవాలని జపాన్ కోరుకుంటోందన్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు