Today Top Stories: దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ టీమ్.. ఒక్కడే 400 పరుగులు బాదాడు.. చిరు 156 మూవీ టైటిల్ ఫిక్స్

By Rajesh Karampoori  |  First Published Jan 16, 2024, 6:16 AM IST

Today Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ సోర్టీస్ లో దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ టీమ్,తెలంగాణలో ఇక నుంచి ‘ఎంసెట్’ మాయం , ఈడీకి కవిత లేఖ.. ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రాజీనామా..తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీపై కాంగ్రెస్ ఫోకస్.. రంగంలోకి షర్మిల, చిరు 156 మూవీ టైటిల్ ఫిక్స్.., ఒకే ఫ్రేమ్ లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీ.. నెట్టింట్లో ఫోటోలు వైరల్, బీసీసీఐ దేశవాళీ టోర్నీలో సంచలనం .. ఒక్కడే 400 పరుగులు బాదాడు..వంటి పలు వార్తల సమాహారం


Today Top Stories: దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ టీమ్  
 
Telangana CM Revanth Reddy at Davos: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. జనవరి 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను WEF చీఫ్ కు రేవంత్ రెడ్డి వివరించారు.  అలాగే... వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో పాటు ఇతర ప్రముఖులను, నిర్వాహకులతో  సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశాలపై వారితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అంతకుముందు ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF 2024)లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో పలువురు భారత ప్రముఖులు వీరికి ఘన స్వాగతం పలికారు.రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మరింత అభివృద్ది చేసేందుకు దావోస్ ను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర బృందానికి సూచించారు. 

ఈడీకి కవిత లేఖ

Latest Videos

ఈ నెల 15న విచారణకు హాజరు కాలేనని  ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు  భారత రాష్ట్ర సమితి  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  సోమవారం నాడు లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని కల్వకుంట్ల కవితకు  ఈడీ  నోటీసులు పంపింది.  అయితే విచారణకు హాజరు కాలేనని కల్వకుంట్ల కవిత  ఈడీకి లేఖ రాశారు.

తెలంగాణలో ఇక నుంచి ‘ఎంసెట్’ మాయం.. ఎందుకంటే ?


TS EAMCET : తెలంగాణలో ఎంసెట్ పేరు మార్చేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమయ్యింది. ఎంసెట్ పరీక్ష నిర్వహించి దీని ద్వారా రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సులను భర్తీ చేస్తున్నారు. మొదట్లో ఈ ఎంసెట్ ద్వారా మెడికల్ సీట్లు కూడా భర్తీ చేసేవారు. కానీ ఐదారేళ్లుగా మెడికల్ సీట్ల భర్తీని నీట్ ద్వారా చేపడుతున్నారు. అందుకే ఇందులో మెడికల్ పేరును సూచించే అక్షరాన్ని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి బదులుగా ఫార్మసీ పదాన్ని సూచించే పీ అనే అక్షరాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అనుకుంటోంది.

తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచింది.  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణ నుండి రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం నాడు  చంద్రశేఖర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా నియమించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  చంద్రశేఖర్. ప్రస్తుతం బీజేపీ రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 


ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రాజీనామా

AP Congress: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. దీంతో వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయింది. ఒకటి లేదా రెండు రోజుల్లో వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీపీసీసీ చీఫ్ పగ్గాలు అందుకోబోతున్నారు.


ఏపీపై కాంగ్రెస్ ఫోకస్.. రంగంలోకి షర్మిల
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం  కాంగ్రెస్ పార్టీ  వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది.  కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  ఎన్నికైన ఎంపీలు కీలక పాత్ర పోషించిన  సందర్భాలు కూడ లేకపోలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజననతో  కాంగ్రెస్ పార్టీ  ఉనికిని కోల్పోయింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఎన్నికలకు  కొన్ని రోజుల ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై  కూడ  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ లో  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  ఈ ఎన్నికల్లో   కనీసం  15 శాతం  ఓట్లను సాధించాలని  కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది.  ఈ దిశగా  ఆ పార్టీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 

ఒక్కడే 400 పరుగులు బాదాడు

బీసీసీఐ దేశవాళీ టోర్నీ కూచ్ బెహర్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. ఈ ట్రోఫీ ఫైనల్ లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ ప్రఖర్ చతుర్వేది చరిత్ర సృష్టించాడు. ఈ అండర్-19 పోటీలో భాగంగా కర్నాటక – ముంబై జట్ల మధ్య కర్ణాటక వేదికగా జరిగిన మ్యాచులో 404 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ట్రోఫిలో అత్యధిక వ్యక్తిగత  స్కోర్ నమోదు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అండర్‌ – 19 క్రికెటర్ల కూచ్ బెహర్ ట్రోఫీ 2023-2024 ఫైనల్‌లో భాగంగా ముంబై-కర్ణాటక జట్లు తలపడ్డాయి. జనవరి 12న కేఎస్‌సీఏ నెవులే స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

సచిన్ టెండూల్క‌ర్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. 

Sachin Tendulkar Deepfake Video: డీప్‌ఫేక్  వీడియోలు క‌ల‌కలం రేపుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలకు సంబంధించిన‌ డీప్‌ఫేక్ వీడియోలు వైర‌ల్ గా మారిన నేప‌థ్యంలో చాలా మంది ఈ టెక్నాల‌జీ దుర్వినియోగంపై ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ర‌ష్మిక మంద‌న్న‌, క‌త్రినా క‌ఫ్ వంటి సినీ తారల‌కు సంబంధించి డీప్‌ఫేక్ వీడియోల‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మైన త‌రుణంలో తాజాగా ఈ లిస్టులో దిగ్గ‌జ క్రికెట్ స‌చిన్ టెండూల్క‌ర్ చేరారు. స‌చిన్ ఒక గేమింగ్ యాప్ ను ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలో క‌నిపంచింది. ఈ యాప్ తో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెబుతూనే.. త‌న కుమార్తె సారా టెండూల్కర్ కూడా దీని నుంచి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు అందుకుంటున్న‌ద‌ని అందులో పేర్కొన్న‌ట్టుగా ఉంది. ఈ త‌ప్పుడు ప్ర‌చారంపై టెండూల్క‌ర్ ఆందోళ‌న వ్యక్తంచేశారు.

చిరు 156 మూవీ టైటిల్ ఫిక్స్.. 

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక బల్క్ బస్టర్, ఒక డిజాస్టర్ వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో చిరు ఫ్యాన్స్ ని ఖుషి చేయగా.. భోళా శంకర్ తో నిరాశపరిచారు. అయితే చిరంజీవి 156 మూవీపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే బింబిసార లాంటి జానపద చిత్రంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి మూవీ చాలా రోజుల క్రితమే ఖరారయింది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జానపద చిత్రంతో మ్యాజిక్ చేసిన వశిష్ఠ చిరంజీవితో కూడా అదే తరహా చిత్రాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనితో అభిమానులంతా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మించేలా ఉండాలని అంచనాలు పెట్టుకున్నారు. మెగా 156 అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా మెగా ఫ్యాన్స్ కి డైరెక్టర్ వశిష్ఠ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మెగా 156 మూవీ టైటిల్ రివీల్ చేస్తూ కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ముందు నుంచి వినిపిస్తున్న విశ్వంభర అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. అదే విధంగా మూవీ రిలీజ్ డేట్ కూడా ఖరారయింది 

ఒకే ఫ్రేమ్ లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీ.. నెట్టింట్లో ఫోటోలు వైరల్ 

 
తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ది అనే చెప్పాలి. అల్లు వారి ఫ్యామిలీ, చిరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు, అల్లు వారి అభిమానులకు సంక్రాంతి వేళ అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది. ఎన్నోఏళ్లుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నవిధంగా ఇరు కుటుంబ సభ్యులు ఓకే చోట కనిపించారు.  చిరు ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ సభ్యులంతా ఓకేఫ్రేమ్ లో కనిపించారు. ఫ్యామిలీ ఫొటోలో చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజావైష్ణవ్ తేజ్, కొత్త కోడలు లావణ్య త్రిపాఠి, అల్లు స్నేహా రెడ్డి, ఉపాసన కొణిదెలతో పాటు కూతుర్లు, మనవరాళ్లు, మనవళ్లు, బంధువులంతా ఉన్నారు... కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. 

click me!